తరగతి గదిలో ఉండాల్సిన బాలికలు.. పాఠశాల మరుగుదొడ్డిలో.. ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్..

ABN , First Publish Date - 2022-09-23T00:17:40+05:30 IST

కొన్ని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ అధ్వానంగా ఉంటుంది. అభివృద్ధి పనులకు నిధులు మంజూరవుతున్నా.. నిర్వహణ విషయంలో మాత్రం చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు...

తరగతి గదిలో ఉండాల్సిన బాలికలు.. పాఠశాల మరుగుదొడ్డిలో.. ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్..

కొన్ని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ అధ్వానంగా ఉంటుంది. అభివృద్ధి పనులకు నిధులు మంజూరవుతున్నా.. నిర్వహణ విషయంలో మాత్రం చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇక మరుగుదొడ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా పాఠశాలల్లో విద్యార్థులతోనే అన్ని పనులూ చేయిస్తుంటారు. చెత్తాచెదారం ఊడ్పించడం, మరుగుదొడ్లు శుభ్రం చేయించడం.. తరచూ వివాదాస్పదమవడం చూస్తూనే ఉంటాం. మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పుస్తకాలు పట్టుకోవాల్సిన బాలికలు.. మరుగుదొడ్లను శుభ్రం చేసే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.


మధ్యప్రదేశ్ (Madhya Pradesh) గుణ జిల్లా పరిధి బామోరిలోని చక్‌దేవ్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాల నిర్వహణ అధ్వానంగా ఉందంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినులకు పాఠాలు బోధించాల్సింది పోయి.. మరుగుదొడ్లను శుభ్రం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల పాఠశాలలో 5, 6వ తరగతి చదువుతున్న అక్కాచెల్లెళ్లు, మరికొంత మంది చేతిలో చీపురు పట్టుకుని టాయిలెట్‌ని శుభ్రం చేస్తున్న ఫొటోలు (Girls photos) సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది.

నీళ్లు కావాలని యువతిని అడిగిన ఫుడ్ డెలివరీ బాయ్.. ఆమె వెనుకే లోపలికి వెళ్లి.. ముద్దులు పెట్టి మరీ...


గుణ జిల్లాలో (Guna District) 2311 ప్రభుత్వ పాఠశాలలు (Government schools) ఉండగా, 4,700 మరుగుదొడ్లు (Toilets) అవసరం ఉంది. అయితే 890మాత్రేమ ఉన్నాయని తెలిసింది. అలాగే జిల్లాలో 125 మరుగుదొడ్ల మరమ్మతులకు రూ.25 లక్షల నిధులు (funds) మంజూరయ్యాయని జిల్లా అధికారులు చెబుతున్నారు. మరమ్మతులతో పాటూ పారిశుధ్య సిబ్బందిని నియమించాల్సి ఉండగా.. ఎందుకు పట్టించుకోలేదంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదిలావుండగా, బాలికలు మరుగుదొడ్లు శుభ్రం చేసే సమయంలో ప్రధానోపాధ్యాయురాలు సమావేశానికి వెళ్లినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఇదిలావుంగా, ఈ ఘటనపై దీనిపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. వెంటనే పాఠశాలను తనికీ చేయడంతో పాటూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మాకు నిశ్చితార్థం జరిగింది.. తను నాకు కాబోయే భార్య.. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండని.. కాళ్లు పట్టుకుని వేడుకున్నా..



Updated Date - 2022-09-23T00:17:40+05:30 IST