చట్టసభలలో జ్ఞాననేత్రులకు రిజర్వేషన్‌ కోరుతూ 12నుంచి పాదయాత్ర

ABN , First Publish Date - 2021-12-05T05:35:06+05:30 IST

చట్టసభలలో జ్ఞాననేత్రులకు రిజర్వేషన్‌ కోరు తూ పాదయాత్ర చేపడుతున్నట్లు జ్ఞాననేత్రుల రిజర్వేషన్‌ సాధన సమితి నాయ కుడు పొన్నలూరి శ్రీనివాసఫణి పేర్కొన్నారు.

చట్టసభలలో జ్ఞాననేత్రులకు రిజర్వేషన్‌ కోరుతూ 12నుంచి పాదయాత్ర




ఒంగోలు(కల్చరల్‌), డిసెంబరు 4: చట్టసభలలో జ్ఞాననేత్రులకు రిజర్వేషన్‌ కోరు తూ పాదయాత్ర చేపడుతున్నట్లు జ్ఞాననేత్రుల రిజర్వేషన్‌ సాధన సమితి నాయ కుడు పొన్నలూరి శ్రీనివాసఫణి పేర్కొన్నారు. శనివారం ఒంగోలులోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దృష్టిలోపం ఉన్న ప్పటికీ విద్యా, ఉద్యోగ, వ్యాపార, న్యాయవాద, కళా, క్రీడారంగాలలో జ్ఞాననేత్రులు రాణిస్తున్నారన్నారు. వారికి విద్యా, ఉద్యోగాలలో 1 శాతం రిజర్వేషన్‌ ఉన్నప్పటికీ పంచాయతీ నుంచి పార్లమెంట్‌ వరకు ఎలాంటి రిజర్వేషన్‌ లేదని చెప్పారు. చట్ట సభలలో జ్ఞాననేత్రులకు రిజర్వేషన్‌ కల్పించాలని కోరుతూ ఈ నెల 12న తిరుపతి నవజీవన్‌ బ్లైండ్‌ హోం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జనవరి 26 రిపబ్లిక్‌డే రోజుకు విజయవాడ కనకదుర్గమ్మ గుడికి చేరేలా ప్రణాళిక రూపొం దించినట్లు చెప్పారు. ఈ పాదయాత్రకు వివిధ రంగాల ప్రముఖులు, అన్ని మతా ల గురువులు, ప్రజల సహకారం కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు.


Updated Date - 2021-12-05T05:35:06+05:30 IST