కూలిన హైమాస్ట్‌ లైట్ల స్తంభం

ABN , First Publish Date - 2022-05-24T05:43:02+05:30 IST

కూలిన హైమాస్ట్‌ లైట్ల స్తంభం

కూలిన హైమాస్ట్‌ లైట్ల స్తంభం
ఒక వైపునకు వాలిన స్తంభం

ఘట్‌కేసర్‌, మే 23: గాలికి ఘట్‌కేసర్‌లోని అంబేడ్కర్‌ చౌరస్తాలోని హైమాస్ట్‌ లైట్ల స్తంభం సోమవారం కూలిపోయింది. పోల్‌ బేస్‌ తుప్పు పట్టడంతో ఒకవైపునకు ఒరిగింది. అయితే ఎవరికీ ప్రమాదం జరుగలేదు. ప్రజలు తిరిగే రోడ్డు కావడంతో ఈ చోట స్తంభాన్ని పటిష్టంగా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. చైర్‌పర్సన్‌ పావని, కమిషనర్‌ వసంత, పలువురు కౌన్సిలర్లు, స్థానికులు అక్కడికి చేరుకొని స్తభాన్ని క్రేన్‌తో దాన్ని తొలగించారు. త్వరలో కొత్త హైమాస్ట్‌ లైట్ల స్తంభాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ పావని తెలిపారు.

Updated Date - 2022-05-24T05:43:02+05:30 IST