ఎమ్మెల్సీ పదవికి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా

ABN , First Publish Date - 2020-07-01T18:36:07+05:30 IST

ఎమ్మెల్సీ పదవికి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేశారు. మండలి కార్యదర్శికి రాజీనామా లేఖను అందజేశారు. గత నెల 19న పిల్లి సుభాష్

ఎమ్మెల్సీ పదవికి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా

అమరావతి : ఎమ్మెల్సీ పదవికి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేశారు. మండలి కార్యదర్శికి రాజీనామా లేఖను అందజేశారు. గత నెల 19న పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ పదవికి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. కాసేపట్లో మంత్రి పదవికి కూడా రాజీనామా చేయనున్నారు. ముఖ్యమంత్రిని కలిసి రాజీనామా లేఖను సమర్పించనున్నారు. మరో మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా రాజ్యసభకు ఎన్నికయ్యారు.  ఆయన కూడా ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేయనున్నారు.

Updated Date - 2020-07-01T18:36:07+05:30 IST