Is Your Phone Giving You Acne? ముఖం మీద మొటిమలు తగ్గడం లేదా? అయితే మీ స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించండి.

ABN , First Publish Date - 2022-09-26T17:20:51+05:30 IST

జీవన విధానంలో మార్పులు, ఆహారం సరిగా తీసుకోకపోవడం, రక్త హీనత, ఒత్తిడి మొటిమలు పెరగడానికి ప్రధాన కారణాలు కావచ్చు.

Is Your Phone Giving You Acne? ముఖం మీద మొటిమలు తగ్గడం లేదా? అయితే మీ స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించండి.

టీనేజ్ లో రావాల్సిన మొటిమలు నలభైలకు దగ్గరవుతున్నా ఎక్కువగా ముఖం మీద కనిపిస్తున్నాయంటే.. దానికి అనారోగ్య సమస్యలు, ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్స్ లోపం అంటూ ఏదో కారణాలు చెప్పుకుంటూ దాటవేసేస్తుంటారు. తీవ్రమైన మొటిమలతో బాధపడుతుంటారు. అసలు స్మార్ట్ ఫోన్ వాడకం పెరుగటమే ఈ మొటిమలకు కారణం కావచ్చని మీకు తెలుసా?


ఆడవారిలో మొటిమలు పెరగడానికి అనేక కారణాలుంటాయి. జీవన విధానంలో మార్పులు, ఆహారం సరిగా తీసుకోకపోవడం, రక్త హీనత, ఒత్తిడి మొటిమలు పెరగడానికి ప్రధాన కారణాలు కావచ్చు. అయితే ఇందులో మరో కారణం కూడా చేర్చాల్సి వస్తుంది. అదే స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల కూడా ఈ మొటిమలు పెరుగుతాయట.. అదెలాగంటే...


1. మొటిమలు..

సెల్ ఫోన్ వల్ల వచ్చే అత్యంత సాధారణ సమస్యల్లో మొటిమలు ఒకటి. దీనికి ఫోన్ మీద పేరుకుపోయిన ధూళి కణాలు, సూక్ష్మక్రిములు కారణం కావచ్చు. మీరు ఫోన్ తాకిన ప్రతిసారీ అవి మీ చేతులకు, తర్వాత ఫోన్ మాట్లాడే సమయంలో చంపలకు అంటుకుంటాయి.  ముఖానికి వేసే మేకప్, తేమ, చెమటను ప్రధానంగా ఈ సూక్ష్మ క్రిములు వాడుకుంటాయి. అలాగే చాలా మందిలో ఫోన్ ను వాష్ రూం లోనికి తీసుకువెళ్ళే అలవాటు కూడా ఉంటుంది. ఇది కూడా సూక్ష్మ క్రిములు పేరిగేందుకు అవకాశంగా మారుతుంది. 


ఇలా చేసి చూడండి..

ఫోన్ ను క్రమం తప్పకుండా వారంలో రెండుసార్లు శుభ్రంగా తుడవండి. దీనికి ఆల్కహాల్ ద్రావణం అయితే సరిపోతుంది. ఫోన్ మాట్లాడడానికి ఇయర్ ఫోన్స్ ను వాడుతూ ఉండండి. 


2. అలర్జీలు..

ముఖం, ప్రత్యేకించి బుగ్గల మీద దద్దుర్లు, చిన్న చిన్న పొక్కులుగా వస్తుంటే కూడా ఇది ఫోన్ వల్లనే అనుకోవచ్చు. ఫోన్ ద్వారా ఇలా వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన స్మార్ట్ ఫోన్ కేసింగ్ లలో నికెల్, క్రోమియంలు ఉంటాయి. ఇవి ముఖం మీద అలెర్జీలకు కారణం అవుతాయి. దీనిని కాంటాక్ట్ డెర్మటైటిస్ అని పిలుస్తారు.


ఇలా చేసి చూడండి..


దీనికి అనువైన మార్గం మీ ఫోన్ ను ప్లాస్టిక్ కేస్ లో ఉంచండి, లేదా ప్రొటెక్టర్ తో కవర్ చేసి వాడుకున్నా సరిపోతుంది.


3. ముడతలు..

టెక్నెక్ గురించి తెలుసా? ఎక్కువ సేపు సెల్ కీబోర్డ్ ను చూస్తూ ఉండటం వల్ల గడ్డం, మెడ కింద భాగాలలో ముడతలు వస్తాయి. టెక్ నెక్ అని కూడా దీనిని పిలుస్తారు. చాలా చిన్న అక్షరాలను ఫోన్ లో చదవడానికి కళ్ళను వంచి చూడడం వల్ల కూడా కళ్ల చుట్టూ వలయాలు, ముడతులు రావడానికి కారణం అవుతుంది.


ఇలా చేసి చూడండి...

రెగ్యులర్ గా ఫోన్ చూడాల్సి వచ్చేవారు కాస్త విరామాలు తీసుకోండి. ఫోన్ లో అక్షరాలను చదివేప్పుడు మీ కళ్ళజోడును ఉపయోగించండి. 


4. డార్క్ స్పాట్స్: 

ఫోన్ ను ఎక్కువ కాలం వాడటం వల్ల అది నెమ్మదిగా చార్జింగ్ పెట్టే సమయాల్లో వేడెక్కుతుంది. అలాగే ఫోన్ చూస్తున్నప్పుడు కూడా వేడిగా మారుతుంది. ఫోన్ లో ఎక్కువ మాట్లాడినా కూడా ముఖం కూడా ఫోన్ తో కాంటాక్ట్ అవుతుంది. దీనితో ముఖం మీద నల్లని వలయాలు, మచ్చలు వస్తాయి. ఇది మెలనిన్ ఉత్పత్తికి ఆటంకం అవుతుంది.


ఇలా చేసి చూడండి..

ఎక్కువ సేపు ఫోన్ మాట్లాడకుండా చూసుకోవాలి. లేదా ఫోన్ మాట్లాడాల్సి వస్తే ఇయర్ ఫోన్స్ వాడటం, లౌడ్ స్రీకర్స్ ద్వారా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి.


5. కంటి కింద వలయాలు..

ఫోన్ LEDబ్లూ లైట్ కంటి కింద సర్కిల్స్ కి కారణం అవుతుంది. నిద్రపోయే ముందు చాలా మందికి ఫోన్ లు వాడే అలవాటు ఉంటుంది. ఇది స్లీప్ సైకిల్ కు భంగం కలిగించడమే కాకుండా కంటి కింద వలయాలకు కూడా కారణం అవుతుంది.


ఇలా చేసి చూడండి..

వీలైతే నిద్రకు అరగంట ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. లేదా సైలెంట్ లో బ్రైట్ నెస్ ని తగ్గించి పెట్టుకోండి. ఇలాంటి పరిష్కారాలతో ఫోన్స్ ను దూరంగా ఉంచండంవల్ల మొటిమల సమస్య తీవ్రత తగ్గుతుంది.

Updated Date - 2022-09-26T17:20:51+05:30 IST