పింఛనదారులకు తప్పని ఇక్కట్లు

ABN , First Publish Date - 2021-11-02T06:20:24+05:30 IST

ప్రభుత్వ కొత్త నిబంధనలతో పింఛనదారులకు ఇక్కట్లు తప్ప టం లేదు. గత రెండు మాసాలుగా ఏ నెల పింఛన ఆ నెలలోనే తీసుకోవాలన్న షరతుపెట్టారు.

పింఛనదారులకు తప్పని ఇక్కట్లు

కొత్త నిబంధనలు యథాతథం

సడలింపు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు 

అనంతపురం వ్యవసాయం, నవంబరు 1:  ప్రభుత్వ కొత్త నిబంధనలతో పింఛనదారులకు ఇక్కట్లు తప్ప టం లేదు. గత రెండు మాసాలుగా ఏ నెల పింఛన ఆ నెలలోనే తీసుకోవాలన్న షరతుపెట్టారు. పోర్టబులిటీ విఽధానాన్ని రద్దు చేశారు. ఈ రెండు వెసులుబాట్లు ఉండటం ద్వారా ఎలాంటి నిబంధనల అతిక్రమణలు జరిగేందుకు అవకాశం లేదు. అ యినప్పటికీ ప్రభుత్వం మొండివైఖరితో పింఛనదారులను ఇ బ్బంది పెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మూడు నెలలకో మారు పింఛన తీసుకునే వె సులుబాటు ఉండేది.  సోమవారం పింఛన్ల పంపిణీ చేపట్టా రు. ఈనెలలో జిల్లాకు 5.09 లక్షల మందికి రూ.118.94 కో ట్లు మంజూరు చేశారు. తొలి రోజు 4.72 లక్షల మందికి రూ. 110.42 కోట్లు (92.84 శాతం) పంపిణీ చేశారు. మంగళ, బు ఽధవారాల్లో మిగతా వారికి పంపిణీ చేయనున్నారు.


బయోమెట్రిక్‌ పరికరాల కొరతతో వలంటీర్లకు కష్టాలు 

బయోమెట్రిక్‌ పరికరాల కొరతతో వలంటీర్లు కష్టాలు పడుతున్నారు. నిబంధనల మేరకు వలంటీర్లందరికీ బయోమెట్రిక్‌ పరికరాలు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో సగం  మంది వలంటీర్లకు ఈ పరికరాలు ఇవ్వలేదు. దీంతో స్థానికంగా ఇద్దరు, ముగ్గురు వలంటీర్లు కలిపి సర్దుకొని పింఛన్లు పంపిణీ చేయాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. వలంటీర్ల వ్యవస్థ ప్రారంభించినప్పటికే ఈ సమస్య ఉంది. అయితే తగినన్ని పరికరాలు తెప్పించడంలో సంబంధిత అధికారులు శ్రద్ధ చూపడం లేదు. దీనిపై ఆ వర్గాల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. 


Updated Date - 2021-11-02T06:20:24+05:30 IST