పైనాపిల్‌ హల్వా

ABN , First Publish Date - 2021-10-30T18:54:47+05:30 IST

పైనాపిల్స్‌ - రెండు, నెయ్యి - 30గ్రాములు, జీడిపప్పు - 15గ్రాములు, ఎండుద్రాక్ష - 10గ్రాములు, కోవా - 10గ్రాములు, పంచదార - 200గ్రాములు, యాలకులు - ఒక టీస్పూన్‌.

పైనాపిల్‌ హల్వా

కావలసినవి: పైనాపిల్స్‌ - రెండు, నెయ్యి - 30గ్రాములు, జీడిపప్పు - 15గ్రాములు, ఎండుద్రాక్ష - 10గ్రాములు, కోవా - 10గ్రాములు, పంచదార - 200గ్రాములు, యాలకులు - ఒక టీస్పూన్‌. 


తయారీ విధానం: ముందుగా పైనాపిల్‌ పొట్టు తీసి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత ఆ ముక్కల్లో నీళ్లు లేకుండా పిండేయాలి. స్టవ్‌పై కడాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి పైనాపిల్‌ ముక్కలు వేసి వేగించాలి. తరువాత పంచదార, కోవా వేసి కలియబెట్టాలి. కొన్ని జీడిపప్పు పలుకులు, యాలకుల పొడి వేసుకోవాలి. చివరగా మిగిలిన జీడిపప్పు, ఎండుద్రాక్షతో గార్నిష్‌ చేసి వేడివేడిగా తినాలి.


కొడాలి వెంకటేశ్వరరావు

ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌, గోల్కొండ హోటల్‌

హైదరాబాద్‌

Updated Date - 2021-10-30T18:54:47+05:30 IST