రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా.. శ్రీలంక ఎదుట కొండంత లక్ష్యం

ABN , First Publish Date - 2022-03-14T02:37:45+05:30 IST

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు (డే/నైట్)లో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 303/9 వద్ద డిక్లేర్ చేసింది

రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా.. శ్రీలంక ఎదుట కొండంత లక్ష్యం

బెంగళూరు: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు (డే/నైట్)లో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 303/9 వద్ద డిక్లేర్ చేసింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 143 పరుగులు కలుపుకుని భారత్ మొత్తం ఆధిక్యం 446 పరుగులకు చేరుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ మెరిశారు. పంత్ 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేసి టెస్టుల్లో అత్యంత వేగంగా అర్ధ సెంచరీ సాధించిన ఇండియన్‌గా రికార్డు అందుకున్నాడు.


శ్రేయాస్ అయ్యర్ 67 పరుగుల చేశాడు.  రోహిత్ శర్మ 46 పరుగులు చేసి అవుట్ కాగా హనుమ విహారి 35 పరుగులు చేశాడు. కోహ్లీ మరోమారు దారుణంగా విఫలమయ్యాడు. లంక బౌలర్లలో ప్రవీణ్ జయవిక్రమ 4 వికెట్లు తీసుకోగా, లసిత్ ఎంబుల్‌దెనియా మూడు వికెట్లు పడగొట్టాడు.


అంతకుముందు శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌట్ అయింది. 86/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంక 23 పరుగులు మాత్రమే జోడించి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. దీంతో భారత్‌కు 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

Updated Date - 2022-03-14T02:37:45+05:30 IST