పెద్దల సభపై ‘గులాబీ’ నేతల ఆశలు

ABN , First Publish Date - 2021-06-16T05:48:20+05:30 IST

శాసన మండలిలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలపై ఓరుగల్లు నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్యేల కోటాలో ఆరు స్థానాలు ఖాళీ అయ్యాయి. గవర్నర్‌ కోటాలో మరోస్థానం ఖాళీ కానుంది. దీంతో ఈ ఏడింట్లో అవకాశం దక్కించు కునేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.

పెద్దల సభపై ‘గులాబీ’ నేతల ఆశలు

ఎమ్మెల్సీ పదవి  దక్కించుకునేందుకు లాబీయింగ్‌

ఓరుగల్లు నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానాలు

బీసీ కోటాలో  మాజీ స్పీకర్‌  సిరికొండ  ప్రయత్నాలు

గత ఎన్నికల్లో కేసీఆర్‌ హామీపె  సీతారాంనాయక్‌ ఆశలు

(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)

శాసన మండలిలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలపై ఓరుగల్లు నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల ఎమ్మెల్యేల కోటాలో ఆరు స్థానాలు ఖాళీ అయ్యాయి. గవర్నర్‌ కోటాలో మరోస్థానం ఖాళీ కానుంది. దీంతో ఈ ఏడింట్లో అవకాశం దక్కించు కునేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఎపీపోడ్‌తో గులాబీ పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వాలనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో  పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీతో పాటు మండలి చైర్మన్‌ బెర్తు కూడా పక్కా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక మహబూబాబాద్‌ మాజీ ఎంపీ సీతారాంనాయక్‌ కూడా ఎమ్మెల్సీ సీటు కోసం సీరియ్‌సగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. 

ఖాళీ అయిన స్థానాలపై నజర్‌

రాష్ట్ర శాసన మండలిలో ఎమ్మెల్యేల కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇప్పటికే వీటిని భర్తీ చేయా ల్సి ఉండగా కరోనా ఉధృతి నేపథ్యంలో ఎన్నికల సంఘం తాత్కాలికంగా వాయి దా వేసింది. ఈ నెలఖారులోగా ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ నేతలు ఎదురుచూస్తున్నా రు. ఈనెల 16న గవర్నర్‌ కోటాలో మరో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కానుంది. దీంతో మొత్తం ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండటంతో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు ము మ్మరం చేశారు. ఈ ఏడింట్లో వరంగల్‌ జి ల్లాకు చెం దిన ఇద్దరు ఎమ్మెల్సీల పదవీ కాలం కూడా పూర్తి కా నుంది. వీరిలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసన మండలి విప్‌ బొడకుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు. వీరికి మరో చాన్స్‌ దక్కుతుందో లేదో గానీ.. సీనియర్ల కోటాలో భూపాలపల్లి, ములుగు జి ల్లాలకు చెం దిన నేతలు మాత్రం ప దవుల కోసం సీరియ్‌సగా ప్రయత్నం చేస్తున్నారు.  

మాజీ స్పీకర్‌కు మండలి పీఠం?

మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారికి ఈ సారి ఎమ్మెల్సీ సీటు పక్కా అని ఆయన అనుచర వ ర్గం అంటోంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌కు కుడి భుజంగా సిరికొండ వ్యవహరించారు. ఉద్యమం తో పాటు పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించా రు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మక స్పీకర్‌ పదవిని సిరికొండకు కేసీఆర్‌ అప్పగించా రు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి ఓటమి పాలైనా మధుసూదనాచారికి కేసీఆర్‌నుంచి గట్టి హామీ లభించిందని ఆయన అనుచరులు అం టున్నారు. 2019లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎ్‌సలోకి రావడాన్ని మధుసూదనాచారి వ్యతిరేకించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సిరికొండకు కేబినేట్‌ స్థాయి పదవి ఇస్తానని కేసీఆర్‌ భరోసా ఇచ్చినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. రాజ్యసభ లేదా శాసనమండలికి కూడా పంపిస్తారనే ఊహాగానాలు వినిపించాయి. 

ఈ రెండున్నరేళ్లలో సిరికొండకు ఏ పదవి కూడా అందకుండా పోయింది. అయితే తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు మధుసూదనాచారికి కలిసొచ్చేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పార్టీకి దూరం కావటంతో పాటు ఉద్యమకారులకు టీఆర్‌ఎ్‌సలో గుర్తింపు లేదనే విమర్శలు చేశారు.  వరంగల్‌ నుంచి ఖాళీ అయినా ఓ ఎమ్మెల్సీ స్థానం నుంచి సిరికొండకు అవకాశం ఇవ్వొచ్చనే టాక్స్‌ వినిపిస్తున్నాయి.  

శాసన మండలి ప్రభుత్వ విప్‌ బొడకుంటి వెంకటేశ్వర్లుకు మరోసారి అవకాశం రాకపోవచ్చని, ఆయన స్థానంలో మరో బీసీ నేత సిరికొండకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ పదవీకాలం కూడా ముగిసిపోయింది. దీంతో శాసన సభ స్పీకర్‌గా  అనుభవం ఉన్న సిరికొండ మధుసూదనాచారికి ఎమ్మెల్సీతో పాటు శాసన మండలి చైర్మన్‌ పదవి కూడా కేసీఆర్‌ అప్పగించొచ్చని  సిరికొండ వర్గీయులు ధీమాతో ఉన్నారు.  

నాయక్‌కు చాన్స్‌ దక్కేనా..?

ములుగు జిల్లా వెంకటాపూర్‌కు చెందిన మహబూబాబాద్‌ మాజీ ఎంపీ సీతారాం నాయక్‌ సైతం ఎమ్మెల్సీ సీటుపై ఆశతో ఉన్నారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో అధిష్ఠానం మహబూబాబాద్‌ ఎంపీ టికెట్‌ సీతారాంనాయక్‌కు కాకుండా రెడ్యానాయక్‌ కూతురు కవితకు ఇచ్చింది. ఆ సమయంలోనే సీతారాంనాయక్‌కు ఎమ్మెల్సీ టికెట్‌పై అధిష్ఠానం  భరోసా ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే, గవర్నర్‌ కోటాల్లోని ఏడు ఎమ్మెల్సీల్లో తనకు అవకాశం ఇవ్వాలని సీతారాం నాయక్‌ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఎస్టీ నియోజకవర్గమైన ములుగు నుంచి పార్టీ వాయిస్‌ వినిపించే నేతలు లేరు. మాజీ మంత్రి చందూలాల్‌ మృతి చెందటంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసే నాయకుడు టీఆర్‌ఎ్‌సలో కనిపించటం లేదు. దీంతో సీతారాం నాయక్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటంతో పాటు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించే అంశాన్ని గులాబీ పెద్దలు పరిశీలిస్తున్నట్టు సమాచారం. మరోవైపు మంత్రి సత్యవతి రాఽథోడ్‌ కూడా ములుగుపై దృష్టి పెట్టి పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో నాయక్‌కు చాన్స్‌ వస్తుందా.. లేక ఎప్పటిలాగే నిరాశ తప్పదా? అనే సందిగ్ధం నెలకొంది. 

Updated Date - 2021-06-16T05:48:20+05:30 IST