సమాజానికి మార్గదర్శకులు సైకాలజిస్టులు

ABN , First Publish Date - 2021-03-01T06:16:34+05:30 IST

సమాజానికి మార్గదర్శకులు సైకాలజిస్టులని ఏయూ రిజిస్ట్రార్‌ వి.కృష్ణమోహన్‌ పేర్కొన్నారు.

సమాజానికి మార్గదర్శకులు సైకాలజిస్టులు
ప్రశంసాపత్రాలు అందుకున్న విద్యార్థులు

ఏయూ రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌

ఏయూ క్యాంపస్‌, ఫిబ్రవరి 28: సమాజానికి మార్గదర్శకులు సైకాలజిస్టులని ఏయూ రిజిస్ట్రార్‌ వి.కృష్ణమోహన్‌ పేర్కొన్నారు. జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా ఏయూ సైకాలజీ విభాగం ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న సైకోమెట్రిక్‌ ఎక్స్‌పో (వర్క్‌షాప్‌) ఆదివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణమోహన్‌ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో సైకాలజిస్టులకు విశేష ప్రాధాన్యం ఉందని, ఆ తరహాలో భారత్‌లో కూడా  సైకాలజిస్టుల సేవలు మెరుగుపడాలన్నారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు మూడు రోజుపాటు సైకోమెట్రిక్‌ పరీక్షలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏయూ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.శ్రీనివాసరావు, ప్రొఫెసర్‌ ఎంవీఆర్‌ రాజు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ సైకోమెట్రిక్‌ పరీక్షలు చేయించుకుని ముందుకు సాగితే విజయం చేరువలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్‌, సునీత, సుభాషిణి, పవన్‌ దామోదర్‌ నాయుడు, వీజేఎఫ్‌ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. 

Updated Date - 2021-03-01T06:16:34+05:30 IST