అందుబాటు ధరలో గృహ రుణాలు.. పిరామల్ క్యాపిటల్ గృహ ఉత్సవ్

ABN , First Publish Date - 2022-07-13T00:50:01+05:30 IST

పిరామల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన పిరామల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌

అందుబాటు ధరలో గృహ రుణాలు.. పిరామల్ క్యాపిటల్ గృహ ఉత్సవ్

హైదరాబాద్: పిరామల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన పిరామల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (పీసీహెచ్‌ఎఫ్‌ఎల్‌) వరంగల్‌లో తొలిసారిగా వినూత్న శైలిలో ప్రాపర్టీ ఎగ్జిబిషన్‌ ‘గృహ ఉత్సవ్‌’ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా అందుబాటు ధరల్లో గృహ రుణాలను ఉద్యోగులు, స్వీయ ఉపాధి కలిగిన వ్యక్తులకు అందజేస్తోంది.


ఈ గృహ ఉత్సవ్‌ను జూలై 16-17 మధ్య ఉదయం 10 గంటల నుంచి రాత్రి  8 గంటల వరకు నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లోని ఏకశిల హాల్‌లో నిర్వహించనుంది. గృహ రుణాలపై  25 బేసిస్ పాయింట్ల(BPS)ను తగ్గించడంతో పాటు ప్రత్యేక లాగిన్‌ ఫీజు రూ. 499తో అందిస్తోంది. అర్హత కలిగిన వారు అవసరమైన పత్రాలతో వచ్చి అక్కడికక్కడే రుణం పొందవచ్చని పిరామల్ క్యాపిటల్ అధికారులు తెలిపారు. అదనంగా 29 ప్రాజెక్టులలో ప్రత్యేక ఆఫర్లు కూడా లభిస్తాయని పేర్కొన్నారు. వీటిని కనకదుర్గ హోమ్స్‌, వీ కనస్ట్రక్షన్, హరిహర కనస్ట్రక్షన్, శ్రీ మావీ (సిగ్నెట్‌) వంటి 12 మంది డెవలపర్లు అందిస్తున్నారు.


ఈ సందర్భంగా పీసీహెచ్‌ఎఫ్‌ఎల్‌  మేనేజింగ్‌ డైరెక్టర్‌ జైరామ్‌ శ్రీధరన్‌ మాట్లాడుతూ.. వరంగల్‌లో గృహ ఉత్సవ్‌ నిర్వహిస్తుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దీని ద్వారా అతి సులభంగా గృహ రుణాలను అందించాలన్నది తమ లక్ష్యమని అన్నారు. పీసీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు అత్యంత కీలకమైన మార్కెట్‌లలో  తెలంగాణ ఒకటని అన్నారు. రాష్ట్రంలో విస్తరించడం మాత్రమే కాకుండా రాబోయే కాలంలో తమ వినియోగదారులకు విభిన్నమైన ఉత్పత్తులను సైతం అందించాలని యోచిస్తున్నట్టు చెప్పారు. 


పీసీహెచ్‌ఎఫ్‌ఎల్‌‌‌కు తెలంగాణాలో  కోట్ల రూపాయల లోన్‌బుక్‌ సైజ్‌ ఉంది. ఇక్కడ 10 శాఖలు ఉండటం వల్ల అత్యంత కీలకమైన మార్కెట్లు అయిన  హిమాయత్‌ నగర్‌, నాగోల్‌, ఏఎస్‌ రావు నగర్‌, కూకట్‌పల్లిలను హైదరాబాద్‌లో కవర్‌ చేయడంతో పాటుగా వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం,  మహబూబ్‌నగర్‌, నల్గొండ వంటి ప్రాంతాలను సైతం కవర్‌ చేస్తుంది. ఈ కంపెనీ రాష్ట్రంలో  తమ శాఖల సంఖ్యను  రాబోయే మూడు సంవత్సరాలలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా  పెట్టుకుంది. అలాగే తమ లోన్‌ బుక్‌ను గృహ రుణాలు, చిన్న వ్యాపార రుణాలు, ఆటో రుణాలు వంటి వాటి ద్వారా మరింతగా  వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.

Updated Date - 2022-07-13T00:50:01+05:30 IST