కదలడు.. వదలడు..!

ABN , First Publish Date - 2022-07-01T06:33:42+05:30 IST

జలవనరుల శాఖలో కొం తమంది అధికారులు తామున్న సీట్ల నుంచి కదలకుండా ఉండేందుకు చాలా కష్టపడుతున్నారు.

కదలడు.. వదలడు..!

అర్హత లేకపోయినా డీఈగా విధులు 

ఇరిగేషన్‌లో ఏఈ నిర్వాకం 

బదిలీ కాకుండా పైరవీలు

ఆంధ్రజ్యోతి - విజయవాడ : జలవనరుల శాఖలో కొం తమంది అధికారులు తామున్న సీట్ల నుంచి కదలకుండా ఉండేందుకు చాలా కష్టపడుతున్నారు. బదిలీల ప్రక్రియ గురువారంతో ముగుస్తుండడంతో ఉన్నత స్థాయిలో పైరవీలు చేయించుకుని ఉన్న పీఠంపైనే ఉండిపోవాలనుకుంటున్నారు. జలవనరుల శాఖలో పై నుంచి కింది స్థాయి వర కు పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది అధికారుల పైరవీలు జి ల్లా అధికారులకు తలనొప్పులు తెస్తున్నాయి. కృష్ణా జిల్లాలో డీఈ పదోన్నతి జాబితాలో పేరు కూడా లేని ఓ ఏఈ.. డీఈ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన్ను బదిలీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆ ఏఈ అక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని భీష్మించుకుని కూ ర్చున్నారు. పెడనలో డ్రైనేజీ విభాగంని ఓ అధికారి మచిలీపట్నంలో జలనవరుశాఖ డీఈ పోస్టులో కొనసాగుతున్నా రు. పై స్థాయిలో పైరవీలు చేసుకుని ఈ పోస్టులోకి ఇన్‌చార్జిగా వచ్చారు. ఇది కాకుండా పెదలంక మేజర్‌ డ్రైన్‌ డ్రెడ్జింగ్‌ పనులకు ఎగ్జిక్యూషన్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఓ ఏఈ ఉన్నప్పటికీ ఆయన్ను తప్పించి ఎగ్జిక్యూషన్‌ అధికారిగా వచ్చారు. ఇందులోనూ భారీగానే పైరవీలు సాగినట్టు సమాచారం. ఈయన డీఈ పదోన్నతికి చాలా దూరంగా ఉన్నారు. పదోన్నతి జాబితాలోనూ పేరు లేదు. అయినా డీఈగా కొనసాగిస్తున్నారు. తాజా బదిలీల్లో ఈయన్ను మచిలీపట్నం నుంచి కదపాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ఏఈని మచిలీపట్నంలో డీఈ పోస్టులో నియమించడం వెనుక పనిచేసిన ప్రజాప్రతినిధి నేరుగా జలవనరుల శాఖ మంత్రి కార్యాలయానికి సిఫార్సు చేసినట్టు తెలిసింది. ఇక్కడున్న అధికారిని బదిలీ చేయవద్దని మచిలీపట్నంలోనే కొనసాగించాలని ప్రతిపాదించారని సమాచారం. డీఈ కాని డీఈ మచిలీపట్నం వీడకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నారు. ఆయన స్వస్థలం మచిలీపట్నం కావడం. రెండోది పెదలంక మేజర్‌ డ్రైన్‌లో రూ.22 కోట్లతో డ్రెడ్జింగ్‌ పనులు సాగుతుండడం. ఈ కారణంగానే  భారీ స్థాయిలో పైరవీలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే కేసీ... కాకపోతే క్వాలిటీ

గుడివాడలో పనిచేస్తున్న ఈఈ ఒకరు విజయవాడకు ఈఈగా రావడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీ (కృష్ణా సెంట్రల్‌) డివిజన్‌లో పోస్టు కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. ఈ పోస్టులో ఈఈగా ఉన్న స్వరూప్‌ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. రెండు రోజుల క్రితమే తిరిగి విధు ల్లో చేరారు. సెలవులో ఉన్నప్పుడు ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన ఈఈ కేసీ డివిజన్‌ సీటుపై కన్నేసినట్టు తెలుస్తోంది. వీలుకాని పక్షంలో క్వాలిటీ కంట్రోల్‌ విభాగం ఈఈగా రావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదే పోస్టులోకి ఇన్‌చార్జిగా రావడానికి గుడివాడ డివిజన్‌ నుంచే ఓ డీఈ పైరవీలు చేస్తున్నారు. మొత్తం మీద జలవనరుల శాఖలో బదిలీల వ్యవహారం పైరవీల పాన్పులపై పరుగులు తీస్తోంది.

Updated Date - 2022-07-01T06:33:42+05:30 IST