పీసా చట్టం.. గిరిజనులకు వరం

ABN , First Publish Date - 2021-04-18T05:01:49+05:30 IST

గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన పీసా చట్టంపై అందరికీ అవగాహన కల్పించాలని ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాఽథ్‌ తెలిపారు.

పీసా చట్టం.. గిరిజనులకు వరం
అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌

పార్వతీపురం, ఏప్రిల్‌ 17 : గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన పీసా చట్టంపై అందరికీ అవగాహన కల్పించాలని ఐటీడీఏ పీవో ఆర్‌.కూర్మనాఽథ్‌ తెలిపారు. శనివారం ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో ట్రైబుల్‌ కల్చర్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ మెషిన్‌ (విశాఖ), సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ సంయుక్తంగా పీసా ప్రత్యేక చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పీవో   మాట్లాడుతూ.. హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన గిరిజనులకు పీసా ప్రత్యేక చట్టం వరంగా మారిందన్నారు. ఈ చట్టం వారి తలరాతలను మార్చిందని తెలిపారు.  గిరిజనుల సంస్కృతిక, సంప్రదా యాలకు అనుగుణంగా, వారి అభివృద్ధికి దోహదపడేలా కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొదించిందన్నారు.  కార్యక్రమంలో ఏపీవో సురేష్‌కుమార్‌, పీసా లీగల్‌ అడ్వయిజర్‌  స్టేట్‌ కోఆర్డినేటర్‌ పి.త్రినాథరావు, సబ్‌ప్లాన్‌ మండలాల వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.


  

Updated Date - 2021-04-18T05:01:49+05:30 IST