పిస్టల్‌తో బెదిరించి దోపిడీ

ABN , First Publish Date - 2022-07-05T15:59:17+05:30 IST

వినియోగదారుల తరహాలో జ్యువెలర్స్‌ దుకాణంలోకి వచ్చిన నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా పిస్టల్‌తో బెదిరించి అక్కడి ఉద్యోగి కాళ్లు చేతులు కట్టేసి

పిస్టల్‌తో బెదిరించి దోపిడీ

 - 3.5 కిలోల బంగారం, 30 కిలోల వెండి, రూ.80వేల నగదుతో ఉడాయించిన దుండగులు


బెంగళూరు, జూలై 4 (ఆంధ్రజ్యోతి): వినియోగదారుల తరహాలో జ్యువెలర్స్‌ దుకాణంలోకి వచ్చిన నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా పిస్టల్‌తో బెదిరించి అక్కడి ఉద్యోగి కాళ్లు చేతులు కట్టేసి 3.5 కిలోల బంగారాన్ని దోపిడీ చేసిన సంఘటన నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. మైలసంద్రలోని రామ్‌దేవ్‌ బ్యాంకర్స్‌ అండ్‌ జ్యువెలర్స్‌లో నగలు తాకట్టు పెట్టుకోవడంతోపాటు బంగారు, వెండి నగలు విక్రయిస్తుంటారు. బోవర్‌లాల్‌ యజమాని అయినా బంధువులే లావాదేవీలు చూస్తుంటారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. కొన్ని నిమిషాలకే మరో ఇద్దరు దుకాణానికి వచ్చారు. అప్పుడే దుకాణం తెరిచి అక్కడ  ఉన్న ఉద్యోగి ధర్మేంద్రను తొలుత పిస్టల్‌తో బెదిరించి కాళ్లుచేతులు కట్టేశారు. సుమారు 3.5 కిలోల బంగారు నగలు, 30 కిలోల వెండి వస్తువులు, రూ.80వేల నగదుతో ఉడాయించారు. కొంత సేపటి తర్వాత ఎలాగో ధర్మేంద్ర కట్లు విప్పుకుని బయటపడి యజమానికి విషయం తెలిపాడు. వెంటనే ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దుకాణానికి చేరుకున్నారు. సీ సీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-07-05T15:59:17+05:30 IST