గండ్లు పూడ్చడంలో నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2021-06-20T05:19:41+05:30 IST

గొల్లప్రోలు, జూన్‌ 19: సార్వా సాగుకు రైతులు సిద్ధమవుతున్నా పంట కాలువలకు పడిన గండ్లు పూడ్చడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ విమర్శించారు. గొల్లప్రోలు మండలం మల్లవరం ఆర్‌ఆర్‌బీ చెరువును శనివారం

గండ్లు పూడ్చడంలో నిర్లక్ష్యం
మల్లవరంలో గండ్లు పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ

గొల్లప్రోలు, జూన్‌ 19: సార్వా సాగుకు రైతులు సిద్ధమవుతున్నా పంట కాలువలకు పడిన గండ్లు పూడ్చడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ విమర్శించారు. గొల్లప్రోలు మండలం మల్లవరం ఆర్‌ఆర్‌బీ చెరువును శనివారం ఆయన పరిశీలించారు. శిథిలమైన షట్టర్లను, తూములకు పడిన గండ్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. గతేడాది ప్రకృతి వైపరీత్యాలు, ఏలేరు, సుద్దగడ్డ కాలువలకు వచ్చిన వరదల కారణంగా షట్టర్లు, కళింగల్స్‌ దెబ్బతిన్నాయని, పలుచోట్ల గండ్లు పడ్డాయని తెలిపారు. వీటికి పది నెలలుగా కనీసం మరమ్మతులు చేయలేదన్నారు. తక్షణం గండ్లు పూడ్చాలని, ఇతర పనులు చేపట్టాలని వర్మ డిమాండ్‌ చేశారు. ఆయన వెంట టీడీపీ మండల అధ్యక్షుడు ఉలవకాయల దేవేంద్రుడు, మడికి ప్రసాద్‌, మల్లిపూడి వీరబాబు, పాలపర్తి వీర్రాజు, కడిమిశెట్టి విజయభాస్కరరెడ్డి ఉన్నారు.

Updated Date - 2021-06-20T05:19:41+05:30 IST