ఆ యువకుడు హెలికాప్టర్‌లో ఎంజాయ్ చేశాడు... అది ల్యాండ్ కాగానే దిగి సెల్ఫీకి ప్రయత్నించాడు... ఇంతలో ఊహించని విధంగా...

ABN , First Publish Date - 2022-07-31T15:54:59+05:30 IST

కొన్నిసార్లు కొంతమంది తమ అభిరుచుల కోసం...

ఆ యువకుడు హెలికాప్టర్‌లో ఎంజాయ్ చేశాడు... అది ల్యాండ్ కాగానే దిగి సెల్ఫీకి ప్రయత్నించాడు... ఇంతలో ఊహించని విధంగా...

కొన్నిసార్లు కొంతమంది తమ అభిరుచుల కోసం తమ జీవితాన్నే ఫణంగా పెడుతుంటారు. తమ అభిరుచులను సాకారం చేసుకోవాలనే తపనలో వారు ఎంతకైనా తెగిస్తుంటారు. సోషల్ మీడియా, సెల్ఫీల మోజులో పడి ప్రాణాలు కోల్పోయిన ఒక యువకుడి ఉదంతం కంటతడి పెట్టిస్తుంది. బ్రిటన్‌లో నివసిస్తున్న సంపన్న కుటుంబానికి చెందిన 22 ఏళ్ల జాక్ ఫెంటన్ హెలికాప్టర్ వింగ్ బలంగా తాకడంతో మరణించాడు. సెల్ఫీపై మోజు కారణంగానే ఆయనకు ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. 


ఆ యువకుడు గ్రీస్‌లో హెలికాప్టర్‌లో ప్రయాణించాడు. హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత, రెక్కలు తిరగడం ఆగిపోకముందే, అతను దానిలో నుంచి దిగి వెనక్కి వెళ్లి సెల్ఫీలు తీసుకోవడం ప్రారంభించాడు. అయితే హాలీకాప్టర్ రెక్కలు అతని తలకు తగిలి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే 22 ఏళ్ల జాక్ ఫెంటన్ తన స్నేహితులతో కలిసి హెలికాప్టర్‌లో గ్రీస్‌కు వెళ్లాడు. హెలికాప్టర్ ప్రైవేట్ హెలిప్యాడ్‌లో దిగింది. అయితే జాక్ దాని రెక్కలు ఆగకముందే కిందకు దిగి సెల్ఫీకి ప్రయత్నించాడు. ఇంతలో దాని రెక్క తగులుకుని మరణించాడు. బెల్ 407 హెలికాప్టర్ ఇంజన్ ఆపడానికి ముందే జాక్ కిందకు దిగడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో లైక్‌ల కోసమే జాక్ ఈ పనిచేశాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 


Updated Date - 2022-07-31T15:54:59+05:30 IST