Advertisement

ఆకాశంలో నుంచి ఊడిపడ్డ వింత వస్తువు.. ఏంటా అని చూస్తే షాక్!

Jan 24 2021 @ 05:41AM

చికాగో: ఓ ఇంట్లో ఉన్న కుటుంబాన్ని భయపెడుతూ దబ్బున పెద్ద శబ్దం చేస్తూ ఓ వస్తువు ఆ ఇంటి తోటలో పడింది. ఆ శబ్దం వింటేనే అది చాలా ఎత్తు నుంచి పడినట్లు తెలిసిపోతుంది. అలా పడిన వస్తువు ఏంటా? అని చూడటం కోసం వెళ్లిన ఆ కుటుంబానికి షాక్ తగిలింది. ఎందుకంటే అదో విమానం చక్రం. వినడానికి వింతగా లేదూ. కానీ ఈ ఘటన అమెరికాలోని చికాగో నగరంలో జరిగింది. ఓ సింగిల్ ఇంజిన్ విమానం ఆకాశంలో వెళ్తుండగా దాని చక్రం ఊడి ఓ ఇంటి తోటలో పడింది. ఐరన్‌వుడ్ ప్రాంతం నుంచి ఈ విమానం బయలు దేరిందని, మార్గమధ్యంలో ఈ ఘటన జరిగిందని అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) అధికారులు చెప్పారు.

Follow Us on:
Advertisement