ప్లానింగ్‌ సిటీల్లో టాప్‌ వన్‌ కాకినాడ

ABN , First Publish Date - 2021-03-09T06:41:25+05:30 IST

ప్లానింగ్‌ సిటీల్లో కాకినాడ కార్పొరేషన్‌ పట్టణ ప్రణాళికా విభాగానికి దేశవ్యాప్త ర్యాంకింగ్‌లో మొదటి స్థానం లభించింది.

ప్లానింగ్‌ సిటీల్లో టాప్‌ వన్‌ కాకినాడ
కాకినాడ వ్యూ

కార్పొరేషన్‌(కాకినాడ), మార్చి8: ప్లానింగ్‌ సిటీల్లో కాకినాడ కార్పొరేషన్‌ పట్టణ ప్రణాళికా విభాగానికి దేశవ్యాప్త ర్యాంకింగ్‌లో మొదటి స్థానం లభించింది. పది లక్షలలోపు జనాభా కేటగిరిలో కాకినాడ నగ రం దేశంలో అత్యంత నివాసయోగ్యమైన ప్రాంతాల్లో టాప్‌ టెన్‌ జాబి తాలో 4వ స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ప్లాన్‌ ప్రిపరేషన్‌, ప్లాన్‌ ఇంప్లిమెంటేషన్‌, ప్లాన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ట్రాన్సిపరెన్సీ అకౌంట్‌బులిటీ, హ్యూమన్‌ రిసోర్స్‌, పార్టిసిపేషన్‌, డీపీఎంఎస్‌, ఆన్‌లైన్‌ ప్లాన్‌ అప్రూవల్‌, ఎల్‌ఆర్‌ఎస్‌, బీపీఎస్‌ రోడ్‌ వైండింగ్‌, జంక్షన్‌ డవలప్‌మెంట్‌ వంటి అంశాల్లో కాకినాడ నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం 54.16 పాయింట్లు సాధించి దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. పది లక్షలలోపు జనా భా కేటగిరిలో కాకినాడకు మొదటి స్థానం లభించడంతో టౌన్‌ ప్లానిం గ్‌ డైరెక్టర్‌ వి రాముడు, టౌన్‌ ప్లానింగ్‌ ఆర్‌జేడీ రంగనాయకులు, కాకినాడ కార్పొరేషన్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌లు అసిస్టెంట్‌ సిటీ ప్లానర్లు కాలేషా, రామ్మోహనరావులను అభినందించారు. 



Updated Date - 2021-03-09T06:41:25+05:30 IST