ప్రాదేశిక నియోజకవర్గాల అభివృద్ధికి ప్రణాళికలు

ABN , First Publish Date - 2021-05-11T05:07:45+05:30 IST

ప్రాదేశిక నియోజకవర్గాల అభివృద్ధికి ప్రణాళికలు

ప్రాదేశిక నియోజకవర్గాల అభివృద్ధికి ప్రణాళికలు
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ విజయలక్ష్మి

  • ఎంపీటీసీలతో సమావేశమైన ఎంపీపీ జైదుపల్లి విజయలక్ష్మి


ధారూరు: ప్రాదేశిక నియోజకవర్గాల అభివృద్ధికి ప్రణాళికలే ముఖ్యమని ఎంపీపీ జైదుపల్లి విజయలక్ష్మి తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ యాక్షన్‌ ప్లాన్‌ 2021-22పై ఎంపీటీసీలతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన నిధులతో 50శాతం గ్రామాల్లో తాగునీటి సౌకర్యం, పారిశుధ్య పనులను చేపట్టాలన్నారు. మిగిలిన 50శాతం నిధులను పాఠశాలలో మరమ్మతులు, నీటిసరఫరా వంటి అవసరాలకు వినియోగించాలని ఆమె సూచించారు. గ్రామాల్లో ఏయే పనులకు ఎన్నినిధులు అవసరమో ప్రణాళిక తయారుచేసి జిల్లా కమిటీకి పంపిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం నిధులు కేటాయించేందుకు అవకాశం ఉంటుందని ఆమె అన్నారు. ఈ సమావేశంలో వైస్‌ఎంపీపీ విజయ్‌నాయక్‌, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పి.బసప్ప, ఎంపీటీసీలు శ్రీనివాస్‌, జగదేవి, నర్సమ్మ, అధికారులు పాల్గొన్నారు. 

మండల సర్వసభ్య సమావేశం వాయిదా

మండల సర్వసభ్య సమావేశాన్ని కొవిడ్‌ దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు ఎంపీపీ జైదుపల్లి విజయక్ష్మి తెలిపారు. స్ర్తీశక్తి భవనంలో సోమవారం ప్రారంభమైన సమావేశానికి ఐదుగురు ఎంపీటీసీలు హాజరుకావడం, సర్పంచుల గైర్హాజరయ్యారు. కొవిడ్‌ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. జూమ్‌ మీటింగ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. 

Updated Date - 2021-05-11T05:07:45+05:30 IST