ఆదిలాబాద్ టౌన్, జనవరి 28: నేషనల్ అసిస్మెంట్ సర్వే సూచనల మేరకు జిల్లాలో కనీస అభ్యాస సామర్థ్యాలను పెంచేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలు రూపొందించి అమలు పరిచే విధంగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. శుక్రవారం నేషనల్ అసిస్మెంట్ సర్వే పై జాతీయస్థాయి మంత్రిత్వ శాఖ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో తన క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి అనితకార్వాల్ మాట్లాడుతూ సర్వే 2017 జాతీయ స్థాయిలో నిర్వహిం చగా ఇందులో 3,5,8,10 తరగతుల విద్యార్థులకు వారి అభ్యా సం సామర్థ్యాలను పరీక్ష నిర్వహించగా 8 రాష్ర్టాల్లోని 8 జిల్లా ల్లో అత్యంత తక్కువ ప్రతిభ కనబర్చినట్లు సర్వేలో తేలిందని కేంద్ర విద్యాశాఖాధికారులు తెలిపారన్నారు. ఆయా జిల్లాల్లో 3,5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు తెలుగులో చదవడం, రాయడం, గణితంలో వెనుకబడి ఉన్నారని గుర్తించినట్లు ప పేర్కొన్నారు.ఆ జిల్లాల్లో వచ్చే ఫిబ్రవరి 2022 నుంచి జనవరి 2023 వరకు కనీస అభ్యాసన సామర్థ్యాలను పెంచేందు కు కార్యచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. కలెక్టర్ వట్లాడుతూ జిల్లాలో రాయడం, చదవడం, కూడికలు, తీసివేతల వంటి కనీస విద్యా బోధన పై దృష్టి సారించాలని అందు కు తగిన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఇం దులో డీఈవో ప్రణిత, సెక్టోరల్ అధికారులు కంటె నర్సయ్య, నారాయణ, ఉదయ్‌శ్రీ, తదితరులు పాల్గొన్నారు.
దళితబంధు పథకం అమలుకు అధికారులు
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పెట్టనున్న దళితబంధు పథకం అమలులో భాగంగా జిల్లా ప్రత్యేకాధికారుల ను కలెక్టర్ నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా దళితబంధు కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో అమలు చేస్తోందని కలెక్టర్ తెలిపారు. ప్రతి నియోజక వర్గానికి వంద మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఆది లాబాద్ నియోజకవర్గానికి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో రాథోడ్ రాజేశ్వర్, బోథ్‌కు అదనపు డీఆర్డీవో రవీందర్ రాథోడ్, ఖానాపూర్‌కు డీఆర్డీవో పీడీ ఎ.కిషన్, ఆసిపాబాద్కు ఉట్నూర్ డివిజనల్ పంచాయతీ అధికారి భిక్షపతిలను నియమించినట్లు తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలో అర్హత కలిగిన వంద మంది ఎస్సీ లబ్ధిదారుల కుటుంబాలను ఆయా శాసనసభ సభ్యుల సహకారంతో ఎంపిక జాబితా సిద్ధం చేసి ఫిబ్రవరి 5లోగా జిల్లా ఇన్చార్జి మంత్రికి సమర్పించాలన్నారు. అదే విధంగా గ్రామ, వార్డు, మండల నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే, మార్చి 5లోగా లబ్ధిదారుల యూనిట్లను గ్రౌండింగ్ అయ్యే విధంగా సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.