హరితహారానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి

Jun 17 2021 @ 00:33AM
వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడుతున్న సోమేశ్‌కుమార్‌

వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌

ఆదిలాబాద్‌టౌన్‌, జూన్‌ 16: హరితహారం కార్యక్రమానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ధరణి., వ్యాక్సినేషన్‌ తదితర అంశాల పై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లకు సూచించారు. బుధవారం బీఆర్‌కే భవన్‌ నుంచి ఆయన కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అటవీ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులో వీడి యో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో తెలం గాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నిర్వహిం చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. తెలంగా ణకు హరితహారం కార్యక్రమంలో మల్టీలేయర్‌లో మొక్కలు నాటడం, అటవీ బ్లాక్‌లను ఏర్పాటు చేయడం, జిల్లాలో నాలుగు మెగా నర్సరీలను పది ఎకరాల చొప్పున ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని, మండల స్థాయిలో పది ఎకరాల చొప్పున పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే వివిధ శాఖలకు చెందిన రోడ్లకు ఇరువైపుల మల్టిలేయర్‌ వరుస క్రమంలో పెద్ద మొక్కలను నాటడం జరుగు తుందని తెలిపారు. జిల్లాలో 1176 గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డులలో పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. వెజ్‌, నాన్‌ వెజ్‌ సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి రెండు ఎకరాల భూమిని గుర్తించామని త్వరలో నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అటవీ శాఖ అధికారి పి.రాజశేఖర్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్‌, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.సాధన, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ ఈఈలు మహవీర్‌, నర్సయ్య, మున్సిపల్‌ సహాయ కమిషనర్‌ సీవీఎన్‌ రాజు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on: