ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి

ABN , First Publish Date - 2020-12-04T05:13:00+05:30 IST

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
మొక్కకు నీరుపోస్తున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పావని

ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పావని


ఘట్‌కేసర్‌: ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ముల్లి పావని జంగయ్యయాదవ్‌ అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని ఎన్‌ఎ్‌ఫసీనగర్‌లో గల బి-1 పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో హరిత హారం కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం బాగా తగ్గిందన్నారు. ఈ విషయాన్ని గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతోపాటు వాటిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా ప్రభుత్వ భూములు, పార్కులు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ మాధవరెడ్డి, కమిషనర్‌ వసంత, మేనేజర్‌ శ్రీధర్‌రెడ్డి,  కౌన్సిలర్‌ వెంకట్‌రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:13:00+05:30 IST