మానవాళి మనుగడకు మొక్కలే ఆధారం

ABN , First Publish Date - 2021-09-19T04:06:32+05:30 IST

మానవాళి మనుగడకు మొక్కలే ఆధారమని కలెక్టర్‌ భారతిహోళికేరి పేర్కొన్నారు. శనివారం ఎస్టీపీపీలో ఏర్పాటు చేసిన మియావాకి ప్లాంటేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ప్రభావిత గ్రామాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. భావితరాలను దృష్టిలో ఉంచుకుని మొక్కలు నాటే కార్యక్ర మాన్ని కొనసాగిస్తుందన్నారు.

మానవాళి మనుగడకు మొక్కలే ఆధారం
ఎస్టీపీపీలో మొక్కలు నాటుతున్న జిల్లా కలెక్టర్‌ భారతి హోళికేరీ, డైరెక్టర్లు

జైపూర్‌, సెప్టెంబరు 18: మానవాళి మనుగడకు మొక్కలే ఆధారమని కలెక్టర్‌ భారతిహోళికేరి పేర్కొన్నారు. శనివారం ఎస్టీపీపీలో ఏర్పాటు చేసిన మియావాకి ప్లాంటేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ప్రభావిత గ్రామాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. భావితరాలను దృష్టిలో ఉంచుకుని మొక్కలు నాటే కార్యక్ర మాన్ని కొనసాగిస్తుందన్నారు. తలసేమియా సికిల్‌సెల్‌ వ్యాధిగ్రస్తుల కోసం రెడ్‌ క్రాస్‌ సొసైటీని దత్తత తీసుకుందన్నారు. సింగరేణి సంస్థ నిర్వహించే రక్తదాన శిబిరాలతో ప్రజల ప్రాణాలను కాపాడగలుగుతున్నామన్నారు.  సింగరేణి ఫైనా న్స్‌ డైరెక్టర్‌ బలరాంనాయక్‌ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఉత్పత్తికే ప్రాధాన్యం ఇవ్వకుండా సమాజం కోసం సంక్షేమ కార్యక్రమాల్లో ముందుంటుం దన్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఆక్సిజన్‌ కొరత లేకుండా చేసినట్లు తెలిపారు. వాయుకాలుష్యం నుంచి ప్రజలను కాపాడడానికి మొక్కలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. అనంతరం సింగరేణి సీఎస్‌ఆర్‌ నిధుల నుంచి రూ.35 లక్షల విలువ గల అంబులెన్స్‌ను కలెక్టర్‌ భారతి హోళికేరికి అందించారు. సింగరేణి డైరెక్టర్‌ (ఈఅండ్‌ఎం) సత్యనారాయణ, ఎస్టీ పీపీ ఈడీ సంజయ్‌కుమార్‌షూర్‌, జీఎం పిచ్చయ్యశాస్ర్తి, సీఐఎస్‌ఎఫ్‌ కమాం డెంట్‌ కార్తికేయన్‌, ట్రైనీ కలెక్టర్‌ ప్రతిభాసింగ్‌, సముద్రాల శ్రీనివాస్‌, జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటి చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-09-19T04:06:32+05:30 IST