రహదారుల వెంట నాటిన మొక్కలను సంరక్షించాలి

ABN , First Publish Date - 2022-05-13T05:29:06+05:30 IST

జిల్లాలోని ప్రధాన రహదారుల వెంట నాటిన మొక్క లను సంరక్షించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి, నర్సరీ, పల్లె ప్రకృతి వనాలతో పాటు బోథ్‌ ఎక్స్‌రోడ్‌ వద్దగల అర్బన్‌ పార్క్‌ను గురువారం ఆమె పరీశీలించారు.

రహదారుల వెంట నాటిన మొక్కలను సంరక్షించాలి


నేరడిగొండ మే12 : జిల్లాలోని ప్రధాన రహదారుల వెంట నాటిన మొక్క లను సంరక్షించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌  అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి, నర్సరీ, పల్లె ప్రకృతి వనాలతో పాటు బోథ్‌ ఎక్స్‌రోడ్‌ వద్దగల అర్బన్‌ పార్క్‌ను గురువారం ఆమె పరీశీలించారు. అలాగే సంబంధిత మండల స్థాయి అధికారుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు బాధ్య తాయుతంగా పనిచేయాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వన్నాన్ని సందర్శించి మొక్కలకు నీరును పోశారు, పల్లె ప్రకృతి వనంలో మొక్కలను సంరక్షించడంతో స్థానిక సర్పంచ్‌ పెంట వెంకటరమణ ఆభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా ప్రతీ గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో వంద శాతం మెక్కలు బతికేలా చర్యలు చేపట్టాలన్నారు, వర్షాకాలం ప్రారం భంలోనే మొక్కలను నాటేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలను సిద్ధం చేయా లన్నారు, గడువులోగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశిం చారు. రోడ్డుకు ఇరువైపులా వేల సంఖ్యలో మొక్కలు నాటాలని కోరారు. రైతులు పొలం గట్లపై నాటిన మొక్కలను కాల్చి వేస్తున్నారని రైతులకు ఆవగాహన కల్పించి నాటిన మొక్కను  కాపాడేలా చర్యలు చేపట్టాలన్నారు.  పెండింగ్‌లో ఉన్న శ్మశాన వాటిక, కంపోస్టు షెడ్లను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు, కలెక్టర్‌ వెంట డీపీవో శ్రీనివాస్‌, డీఆర్‌డీవో కిషన్‌, మండల ప్రత్యేకాధికారి రవిశంకర్‌, నాయబ్‌ తహసీల్దార్‌ జగదీశ్వరి, ఎంపీడీవో అబ్దుల్‌సమద్‌, ఎంపీవో శోభన, ఎఫ్‌ఆర్వో గణేష్‌,  ఏపీవో వసంత్‌రావు, ఎంఆర్‌ఐ నాగోరావ్‌, జడ్పీటీసీ అనిల్‌జాదవ్‌, ఎంపీపీ రాథోడ్‌ సజన్‌, సర్పంచ్‌ వెంకటరమణ పాల్గొన్నారు, 

Read more