లక్ష్యం మేరకు మొక్కలు పెంచాలి

ABN , First Publish Date - 2021-01-22T05:53:39+05:30 IST

లక్ష్యం మేరకు మొక్కలు పెంచాలి

లక్ష్యం మేరకు మొక్కలు పెంచాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పౌసుమిబసు

  • కలెక్టర్‌ పౌసుమిబసు


వికారాబాద్‌: హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2021 సంవత్సరంలో మొక్కలు నాటేందుకు లక్ష్యాల మేరకు అన్ని గ్రామపంచాయతీల్లోని నర్సరీలలో నాణ్యమైన వెరైటీ మొక్కలు పెంచాలని జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు అధికారులకు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, నాణ్యమైన విత్తనాలు సేకరించి ప్లాస్టిక్‌ బ్యాగులలో విత్తనాలు నాటాలని సూచించారు. జులై మాసంలో నిర్వహించే హరితహారం కార్యక్రమంలో నిర్ధేశించిన ప్రకారం అవసరం మేరకు మొక్కలు అందజేసేందుకు ఇప్పటి నుంచే కృషి చేసి మొక్కలను సంరక్షించాలని సూచించారు. డంపింగ్‌యార్డుల వద్ద ఫెన్సింగ్‌ కొరకు గచ్చకాయ మొక్కలు నర్సరీలలో పెంచాలని సూచించారు. పట్టణాల సుందరీకరణకు వికారాబాద్‌, తాండూరు పట్టణాలలోని ప్రధాన కూడళ్ల వద్ద బ్యుటిఫికేషన్‌ పనులు చేపట్టాలని మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, డీఎఫ్‌వో వేణుమాధవ్‌, తాండూరు ఆర్డీవో అశోక్‌కుమార్‌, మునిసిపల్‌ కమిషనర్లు, స్పెషల్‌ అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-22T05:53:39+05:30 IST