రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలి

ABN , First Publish Date - 2021-07-28T05:58:43+05:30 IST

ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఎక్కువ వరుసల్లో మొక్కలు నాటాలని కలెక్టర్‌ శరత్‌ అన్నారు.

రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శరత్‌

కామారెడ్డి టౌన్‌, జూలై 27: ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఎక్కువ వరుసల్లో మొక్కలు నాటాలని కలెక్టర్‌ శరత్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 10లోగా మొక్కలు నాటే కార్యక్రమా న్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు సజావుగా పెరిగే విధంగా చూడాలన్నారు. రైతుల పొలా ల్లోనూ గట్ల వెంట మొక్కలు నాటే విధంగా వారితో సమావేశం ఏర్పాటుచేసి వారికి మొక్కలను అందించి సంరక్షించే విధంగా చూడాలన్నారు. కిలో మీటర్‌కు రెండు వేల మొక్కలు నాటి, వాచర్లను ఏర్పాటు చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు, మండల స్థాయి అధికారులు మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. రక్షణ గార్డులను సక్రమంగా ఏర్పాటు చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న శ్మశానవాటిక, కంపో స్టు షెడ్లు వాడుకలోకి వచ్చే విధంగా చూడాలన్నారు. గ్రామాల్లో రోజువారి గా తడి, పొడి చెత్తను కంపోస్టుషెడ్‌కు తరలించి సేంద్రియ ఎరువు తయా రు చేసే విధంగా చూడాలన్నారు. సేంద్రియ ఎరువులను స్థానిక రైతులకు విక్రయించి పంచాయతీల ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సునంద, ఏపీడీ సాయన్న, డీఎల్‌పీవోలు సాయిబాబా, రాజేంద్రప్రసాద్‌, శ్రీనివాస్‌, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-28T05:58:43+05:30 IST