సర్‌.. ప్లాస్మా ప్లీజ్‌..!

ABN , First Publish Date - 2021-04-19T06:49:31+05:30 IST

‘సర్‌.. నేను ఆస్పత్రి నుంచి మాట్లాడుతున్నాను. మా అంకుల్‌ కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నారు. డాక్టర్‌లు అర్జంట్‌గా ఏబీ

సర్‌.. ప్లాస్మా ప్లీజ్‌..!

 ‘సైబరాబాద్‌’కు వినతుల వెల్లువ

 రోజుకు వంద రిక్వెస్ట్‌లు

 24/7 సేవలు: సీపీ సజ్జనార్‌ 


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ‘సర్‌.. నేను ఆస్పత్రి నుంచి మాట్లాడుతున్నాను. మా అంకుల్‌ కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నారు. డాక్టర్‌లు అర్జంట్‌గా ఏబీ పాజిటివ్‌ బ్లడ్‌ గ్రూప్‌ ప్లాస్మా కావాలంటున్నారు.. మీకు ఫోన్‌ చేస్తే ఫలితం ఉంటుందని చెప్పారు. ప్లీజ్‌ సర్‌ మా అంకుల్‌ ప్రాణాలు కాపాడండి సర్‌.’ అర్ధరాత్రి 12:00కు సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఓ బాధితుడి ఫోన్‌. అప్రమత్తమైన సైబరాబాద్‌ పోలీసులు గంటలో ప్లాస్మాదాతను వెతికి, అతడు చెప్పిన ఆస్పత్రికి పంపించారు. 


వందల్లో విజ్ఞప్తులు..  

సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌కు రోజూ 80-100 వరకు ప్లాస్మా రిక్వెస్టులు వస్తున్నట్లు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పేర్కొన్నారు. సెకండ్‌ వేవ్‌లో కరోనా బారిన పడిన బాధితులను ప్లాస్మా థెరపీద్వారా బతికించుకునేందుకు బాధితుల కుటుంబీకులు ప్లాస్మా కోసం పరుగులు పెడుతున్నారు. సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌తోపాటు, తెలిసిన వారి ద్వారా కరోనా యోధుల కోసం వెతుకుతున్నారు.


24/7 కొవిడ్‌ సేవలు

సెకండ్‌ వేవ్‌ ప్రారంభంమైన మార్చి మొదటి వారంలోనే ప్రత్యేక కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశాము. ఎస్సీఎస్సీ ఆధ్వర్యంలో సుమారు 70 మంది వలంటీర్లు ముందుకు వచ్చి స్వచ్చందంగా సేవలందిస్తున్నారు. ప్లాస్మా రిక్వె్‌స్టలను  క్రోడీకరించడం, ప్లాస్మాదాతలనను ఒప్పింస్తున్నారు. 24/7 సేవలు అందించడానికి మొత్తం మూడు షిఫ్ట్‌లు ఏర్పాటు చేశాం. ఈ  ప్రత్యేక పోలీస్‌ సిబ్బందిని కేటాయించాం. ప్లాస్మా అవసరమైన బాధితులు సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ 94906 17440లో సంప్రదించాలి. కరోనా యోధులు ఎక్కువ సంఖ్యలో ముందుకు వచ్చి ప్లాస్మా దాతలుగా మారి కరోనా బాధితుల ప్రాణాలు రక్షించాలి.  

- వి.సి. సజ్జనార్‌, సైబరాబాద్‌ సీపీ


వెంటనే ప్లాస్మా ఇస్తేనే ఉపయోగం...

ప్లాస్మా అనేది కొవిడ్‌ ఎటాక్‌ అయిన ప్రారంభంలోనే ఇస్తే పేషెంట్‌కు చాలా ఉపయోగకరం. ఆలస్యంగా ఇస్తే ఉపయోగం ఉండదు. డోనర్‌ ఇచ్చిన ప్లాస్మాలో ఇంటర్నేషనల్‌ ప్రమాణాలకు అనుగుణంగా యాంటీబాడీస్‌ ఉంటేనే పనిచేస్తుంది.  

- డాక్టర్‌. టీఎన్‌జె. రాజేష్‌, కన్సల్టెంట్‌ ఇంర్నల్‌ మెడిసిన్‌, స్టార్‌ హాస్పిటల్‌


ప్లాస్మా చాలా ఉపయోగకరం.

కరోనా పాజిటివ్‌ వచ్చిన పేషంట్స్‌కు ప్లాస్మా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు 5వేల మందికి పైగా పేషంట్లను ట్రీట్‌ చేశాను. పేషంట్‌ ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోకముందు, వెంటిలేటర్‌ అవసరం రాకముందే ప్లాస్మా ఇస్తే బాఽధితులు కోలుకుంటారు. అమెరికాలో డాక్టర్‌గా పనిచేస్తున్న మా స్నేహితులు కూడా ఎంతోమందికి ప్లాస్మా థెరపి చేశారు. పేషంట్లు చాలా బాగా కోలుకున్నారు. అయితే పాజిటివ్‌ వచ్చి, రోజులు గడిచిన తర్వాత  ప్లాస్మా ఇస్తే పెద్దగా ఉపయోగం ఉండదు.

- డాక్టర్‌ తూడి పవన్‌రెడ్డి, సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌, సన్‌షైన్‌ హాస్పిటల్‌




Updated Date - 2021-04-19T06:49:31+05:30 IST