ప్లాస్మా దానానికి ముందుకు రావాలి: జేసీ కీర్తి

ABN , First Publish Date - 2020-08-08T09:26:57+05:30 IST

కరోనా బాధితుల ప్రాణాలను కాపాడేం దుకు ప్లాస్మాను దానం చేసేందుకు దాతలు ముందుకు రావాలని జాయింట్‌ కలెక్టర్‌ చేకూరి కీర్తి కోరారు.

ప్లాస్మా దానానికి ముందుకు రావాలి: జేసీ కీర్తి

అమలాపురం కిమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రి సందర్శన


అమలాపురం రూరల్‌, ఆగస్టు 7: కరోనా బాధితుల ప్రాణాలను కాపాడేం దుకు ప్లాస్మాను దానం చేసేందుకు దాతలు ముందుకు రావాలని జాయింట్‌ కలెక్టర్‌ చేకూరి కీర్తి కోరారు. అమలాపురం కిమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రిని శుక్రవా రం ఆమె సందర్శించారు. పీపీఈ కిట్‌ ధరించి వార్డుల్లో పర్యటించి కరోనా బాధితులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ కాకినాడ జీజీహెచ్‌లో ప్లాస్మా థెరపీని ప్రారంభిం చామని, ఆరుగురు దాతలు ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు వచ్చారని అన్నారు.


ప్లాస్మా దానం చేసిన వారికి ప్రభుత్వం రూ.5 వేలు చొప్పున అందిస్తోందని, అమలాపురంలో ముగ్గురు వైద్యులు ప్లాస్మా దానానికి ముం దుకొచ్చారని జేసీ తెలిపారు. కిమ్స్‌కొవిడ్‌ ఆసుపత్రిలో వైద్యసేవలు బాగున్నా యని, రోజుకు రెండు పర్యాయాలు పల్స్‌ చెక్‌ చేస్తున్నారన్నారు. ప్రస్తుతం కిమ్స్‌ ఆసుపత్రిలో 600 బెడ్లు ఉన్నాయని, మరికొన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తొలుత కిమ్స్‌ వైద్య కళాశాల డీన్‌ డాక్టర్‌ ఏఎస్‌ కామేశ్వరరావు, ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వసంతరాయుడితో వైద్య సేవలపై ఆమె సమీక్షించారు. కార్యక్రమంలో కిమ్స్‌ నోడల్‌ అధికారి ఎన్‌.మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-08T09:26:57+05:30 IST