మట్టి పాత్రల వాడకంతోనే ప్లాస్టిక్‌ నియంత్రణ

ABN , First Publish Date - 2022-08-18T06:04:02+05:30 IST

మట్టి పాత్రల వాడకంతోనే ప్లాస్టిక్‌ నియంత్రణ సాధ్యమవుతుందని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు.

మట్టి పాత్రల వాడకంతోనే ప్లాస్టిక్‌ నియంత్రణ
ఆధునిక యంత్రాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌, ఆగస్టు 17: మట్టి పాత్రల వాడకంతోనే ప్లాస్టిక్‌ నియంత్రణ సాధ్యమవుతుందని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని 10వ వార్డు లింగంపేటలో కుమ్మరి శాలివాహన కులవృత్తి దారుల మాస్టర్‌ ట్రైనర్లకు ఆధునిక యాంత్రాలను పంపిణీ కార్యక్రమాన్ని కుమ్మరి సంఘం భవనంలో బుధవారం జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ హాజరై ఆధునిక యంత్రాలను ట్రెనర్లకు అందజేశారు. అనంతరం ఆధునిక యంత్రంపై మట్టిపాత్రను ఎమ్మెల్యే స్వయంగా తయారుచేశారు. ఈ సందర్భంగా సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కుల వృత్తులకు సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యం ఇస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. కుమ్మర కులవృత్తిదారులు ప్రభుత్వం అందించిన ఆధునిక యంత్రాలను వినియోగించుకుని మరింత ఆర్థికంగా ఎదగాలన్నారు. మట్టి పాత్రల విక్రయాల కు జిల్లా కేంద్రంలో ప్రత్యేక స్థలాన్ని కేటాయించేలా తన వంతుగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారి సాయిబాబా, కౌన్సిలర్‌ సిరికొండ భారతీరాజయ్య, జిల్లా కుమ్మరి సంఘం అధ్యక్షుడు మామిడిపెల్లి కృష్ణ, ఏఎంసీ చైర్మన్‌ నక్కల రాధ రవీందర్‌రెడ్డి, కుమ్మరి సంఘం జగిత్యాల మండల అధ్యక్షుడు సిరికొండ రాజన్న, లింగంపేట అధ్యక్షుడు శ్రీనివాస్‌, నాయకులు శ్రీనివాస్‌, మహిపాల్‌, నరేష్‌, చిరంజీవి, చంద్రయ్య, లక్ష్మణ్‌, రమేష్‌, మహేష్‌, శంకర్‌, లచ్చన్న, నర్సయ్య, రాజేందర్‌ తదితరులు ఉన్నారు.


Updated Date - 2022-08-18T06:04:02+05:30 IST