ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌లో మంచి నీళ్లు తీసుకెళుతున్నారా? అయితే..

ABN , First Publish Date - 2022-03-23T18:16:41+05:30 IST

రోజూ స్కూల్‌కి ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌లో మంచి నీళ్లు తీసుకెళుతున్నారా? అయితే ఇకముందైనా పుల్‌స్టాప్‌ పెట్టండి. దాని స్థానంలో కాపర్‌ లేదా మెటల్‌ బాటిల్‌ను ఎంచుకోండి. ఎందుకంటారా?

ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌లో మంచి నీళ్లు తీసుకెళుతున్నారా? అయితే..

ఆంధ్రజ్యోతి(23-03-2022)

రోజూ స్కూల్‌కి ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌లో మంచి నీళ్లు తీసుకెళుతున్నారా? అయితే ఇకముందైనా పుల్‌స్టాప్‌ పెట్టండి. దాని స్థానంలో కాపర్‌ లేదా మెటల్‌ బాటిల్‌ను ఎంచుకోండి. ఎందుకంటారా? రీయూజబుల్‌ ప్లాస్టిక్‌ వాటర్‌బాటిల్‌ కొన్ని వందల రకాల కెమికల్స్‌ను విడుదల చేస్తుందని పరిశోధకులు గుర్తించారు. డెన్మార్క్‌లోని కొపెన్‌హాగెన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించిన వివరాల ప్రకారం తిరిగి ఉపయోగించే ప్లాస్టిక్‌ నీళ్ల బాటిల్స్‌ మనుషుల ఆరోగ్యానికి హాని చేసే రసాయనాలు విడుదల చేస్తున్నాయి.


ఆ బాటిల్స్‌లో స్టోర్‌ చేసిన నీళ్లలో 400 రసాయన పదార్థాలు ఉన్నట్టు అధ్యయనంలో గుర్తించారు. ఆ రసాయనాలలో కార్సినోజన్స్‌, ఎండోక్రైన్‌ డిస్‌రప్టర్స్‌ ఉన్నాయి. పురుగుమందుల తయారీలో వాడే ఒకరకమైన రసాయనం, ప్లాస్టిక్‌ బాటిల్‌ తయారీలో ఉన్నట్టు గుర్తించారు. అందుకే రీయూజబుల్‌ ప్లాస్టిక్‌ బాటిల్స్‌కు గుడ్‌బై చెప్పాలని పరిశోధకులు సూచిస్తున్నారు. వాటి స్థానంలో కాపర్‌ లేదా మెటల్‌ వాటర్‌ బాటిల్స్‌ ఉపయోగించడం మేలని అంటున్నారు. 

Updated Date - 2022-03-23T18:16:41+05:30 IST