ప్లాస్టిక్‌ సంచులకు గుడ్‌ బై

ABN , First Publish Date - 2022-06-28T15:28:42+05:30 IST

ప్లాస్టిక్‌ తొట్లకు బదులుగా, కొబ్బరిపీచుతో చేసిన తొట్లను మొక్కల పరిరక్షణకు వినియోగించాలని అటవీ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో పచ్చదనం పొంపొందేలా

ప్లాస్టిక్‌ సంచులకు గుడ్‌ బై

                           - కొబ్బరిపీచు తొట్లలో మొక్కల పర్యవేక్షణ


పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 27: ప్లాస్టిక్‌ తొట్లకు బదులుగా, కొబ్బరిపీచుతో చేసిన తొట్లను మొక్కల పరిరక్షణకు వినియోగించాలని అటవీ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో పచ్చదనం పొంపొందేలా అటవీ శాఖ పలు చర్యలు చేపట్టడంతో పాటు ‘హరిత తమిళనాడు ఇయక్కం’ను ప్రారంభించింది. ఈ పథకంలో నాటే మొక్కలను రాష్ట్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలోని తోటల్లో పెంచుతున్నారు. ఇప్పటివరకు మొక్కలు, నారు తదితరాలకు ప్లాస్టిక్‌ తొట్లను వినియోగించే వారు. ఇకపై వాటి స్థానంలో కొబ్బరి పీచుతో చేసిన తొట్లు వినియోగించాలని నిర్ణయించారు. కాగా, ప్లాస్టిక్‌ తొట్టెలో మొక్కల పరిక్షణకు రూ.40 అవుతుండగా, కొబ్బరి పీచు తొట్లకు రూ.100 వెచ్చించాల్సి ఉంటుందని, అలాగే, టెంకాయ నారు తొట్లలో స్టాండులపై ఉం చాల్సి రావడంతో వ్యయం కూడా అధికమవుతుందని, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని అటవీ శాఖ చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నారు. 

Updated Date - 2022-06-28T15:28:42+05:30 IST