England vs India: తడిగా ఉన్న మైదానం.. లంచ్ తర్వాత ముందుకు కదలని ఆట

ABN , First Publish Date - 2022-07-01T23:29:15+05:30 IST

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు లంచ్ తర్వాత ఒక్క బంతి కూడా పడలేదు. మైదానం తడిగా

England vs India: తడిగా ఉన్న మైదానం.. లంచ్ తర్వాత ముందుకు కదలని ఆట

బర్మింగ్‌హామ్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు లంచ్ తర్వాత ఒక్క బంతి కూడా పడలేదు. మైదానం తడిగా ఉండడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అంతకుముందు 20.1 ఓవర్ల వద్ద వర్షం ప్రారంభం కావడంతో అంప్లైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు. ఆ సమయానికి భారత్  రెండు వికెట్లు నష్టపోయి 53 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా దారుణంగా విఫలమయ్యారు. 27 పరుగుల వద్ద గిల్ (17) అవుట్ కాగా, 46 పరుగుల వద్ద పుజారా (13) వెనుదిరిగాడు. వీరిద్దరూ జేమ్స్ అండర్సన్ బౌలింగులో జాక్ క్రాలీకే  క్యాచ్ ఇచ్చి వెనుదిరగడం గమనార్హం. ప్రస్తుతం హనుమ విహారి (14), విరాట్ కోహ్లీ (1) క్రీజులో ఉన్నారు.


ప్రస్తుతం వర్షం తగ్గినప్పటికీ మైదానం తడిగా ఉండడంతో లంచ్ తర్వాత ఆటగాళ్లు ఎవరూ మైదానంలోకి రాలేదు. ప్రస్తుతం వర్షం పూర్తిగా తగ్గముఖం పట్టడంతో 6.15 గంటలకు అంపైర్లు మైదానాన్ని పరిశీలిస్తారు. ఆటకు మైదానం అనుకూలంగా ఉందని భావిస్తే మ్యాచ్‌ను కొనసాగిస్తారు.

Updated Date - 2022-07-01T23:29:15+05:30 IST