అంగన్‌వాడీలు... Play schoolsగా మార్పు: బొత్స

ABN , First Publish Date - 2022-05-10T01:37:04+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాలను ప్లేస్కూళ్లగా మార్పు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ వెల్లడించారు.

అంగన్‌వాడీలు... Play schoolsగా మార్పు: బొత్స

శ్రీకాకుళం: అంగన్‌వాడీ కేంద్రాలను ప్లేస్కూళ్లగా మార్పు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ  వెల్లడించారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు. ‘ఒకటి, రెండు తరగతిలను కలిపి ఒక యూనిట్‌గా మార్పు చేస్తున్నాం. ఇక్కడ ఫౌండేషన్‌ కోర్సును తీసుకువస్తున్నాం. 3 నుంచి 10వ తరగతి వరకు ఒక యూనిట్‌గా పరిగణిస్తాం. ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తున్నాం. పాఠశాలల పరిధి మూడు కిలో మీటరు నుంచి ఒక కిలో మీటరు వరకు కుదించాం. అవసరమైన చోట జూనియర్‌ కళాశాలలను డిగ్రీ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. కానీ కొత్తగా కళాశాలలు ఇవ్వం’ అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.  

Read more