సోలార్‌ బాధితులను ఆదుకోండి

ABN , First Publish Date - 2021-04-18T05:03:10+05:30 IST

మండలంలోని శకునాల గ్రామ సమీపాన ఉన్న సోలార్‌ పరిశ్రమలో భూములు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణ, మండల సీపీఎం కన్వీనర్‌ నాగన్న, సీఐటీయూ మండల కార్యదర్శి షాజహాన్‌ శనివారం ఆర్డీవో హరిప్రసాద్‌కు విజ్ఞప్తి చేశారు.

సోలార్‌ బాధితులను ఆదుకోండి


ఓర్వకల్లు, ఏప్రిల్‌ 17:
  మండలంలోని శకునాల గ్రామ సమీపాన ఉన్న సోలార్‌ పరిశ్రమలో భూములు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణ, మండల సీపీఎం  కన్వీనర్‌ నాగన్న, సీఐటీయూ  మండల కార్యదర్శి షాజహాన్‌ శనివారం  ఆర్డీవో  హరిప్రసాద్‌కు విజ్ఞప్తి చేశారు. ఆర్డీవోగా ఆయన నియమితులైనందు వల్ల శనివారం హరిప్రసాద్‌ను వారు కలిసి  పూలబొకే అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో సోలార్‌ పరిశ్రమలో భూములు కోల్పోయిన రైతులకు సంవత్సరాలు గడిచినా నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు. దీంతో వారు  తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీఐఐసీ పేరుతో 10 వేల ఎకరాలకు పైగా భూములు తీసుకున్నారని తెలిపారు.  


నష్టపరిహారం ఇప్పించండి
గడివేముల, ఏప్రిల్‌ 17:
మండలంలోని జిందాల్‌ పరిశ్రమలో పోయిన తమ భూములకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు వెంకటరమణ, పామన్న, సుబ్బన్న, సామెల్‌, బాలస్వామి, నాగన్న  శనివారం పరిశ్రమ సమీపంలోని తమ భూముల వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్నందుకు ప్రభుత్వం తమకు ఈ భూములను ఇచ్చిందని అన్నారు. ఆ భూముల్లో పొలాలు సాగు చేసుకున్నామని అన్నారు. ఆ భూముల్లో జిందాల్‌ యాజమాన్యం రాళ్లు తవ్వి మట్టి వేసిందని అన్నారు. దీంతో తమ జీవనాధారం కోల్పోయామని  అన్నారు.  తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.

Updated Date - 2021-04-18T05:03:10+05:30 IST