లకిష్‌కి ఏమైనా జరిగితే వాళ్లు ఇక కోలుకోలేరు....

ABN , First Publish Date - 2022-01-14T21:13:12+05:30 IST

నా కొడుకును చూస్తే చాలు నాకు కన్నీరు వరదలా వచ్చేస్తోంది. నన్ను భయంతో వణికిస్తున్న ఇలాంటి పరిస్థితి నేనెప్పుడూ ఎదుర్కోలేదు..

లకిష్‌కి ఏమైనా జరిగితే వాళ్లు ఇక కోలుకోలేరు....


నా కొడుకును చూస్తే చాలు నాకు కన్నీరు వరదలా వచ్చేస్తోంది. నన్ను భయంతో వణికిస్తున్న ఇలాంటి పరిస్థితి నేనెప్పుడూ ఎదుర్కోలేదు.... అంటూ లకిష్ తల్లి నరసో తన వేదన చెప్పుకుంటోంది. గతేడాది జూన్ నెలలో నరసో 16 ఏళ్ల కొడుకు లకిష్ ఒక అరుదైన క్యాన్సర్‌కు గురయ్యాడు. అప్పటి నుంచీ ఆ కుటుంబం నానా ఇబ్బందులకు గురవుతూ వచ్చింది. నిరుపేదలైన లకిష్ కుటుంబానికి చెప్పుకోదగిన ఆస్తిపాస్తులేం లేవు. కానీ ఈ పరిస్థితి వారిని కుంగదీయలేదు.


"ఒకరికొకరు తోడుగా ఉండటమనేదే నేను కోరే అతి పెద్ద వరం... నా కుటుంబం నాతో ఉంటే అంతకు మించి నాకింకేమీ వద్దు..." అని చెమ్మగిల్లిన కళ్లతో నరసో చెప్పింది. ఆమెకి ఒక కూతురు కూడా ఉండేది. దురదృష్టవశాత్తు ఆ చిన్నారి 2 ఏళ్ల వయసులోనే మరణించింది. దాంతో ప్రాణానికున్న విలువ ఏమిటో ఆమెకు బాగా తెలుసు. అలాంటి పరిస్థితుల్లో లకిష్‌కి ఇంత తీవ్ర అనారోగ్యం కలగడం ఆ కుటుంబాన్ని షాక్‌కి గురిచేసింది.


                  ఈ లింక్ పై క్లిక్ చేసి లకిష్‌కి సాయం చెయ్యండి....


లకిష్ ఎడమ మోకాలి వద్ద చిన్నపాటి వాపుతో ఈ సమస్య మొదలైంది. అయితే, ఆ పిల్లవాడు దాని గురించి పెద్దగా పట్టించుకోక, ఆ కాలిపై ఒత్తిడి పడరాదని తెలియక తన రోజువారీ పనులు చేసుకుపోయేవాడు. కానీ, క్రమంగా ఆ వాపు మరింత వేగంగా ఎక్కువ అవుతుండటంతో పరిస్థితులు ఉన్నట్టుండి దిగజారడం మొదలైంది. లకిష్ అమ్మానాన్నా ఇక ఆలస్యం చెయ్యకుండా ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించడంతో ఆ అబ్బాయి osteosarcomaకి గురైనట్టు వెల్లడైంది. వెంటనే లకిష్‌ని ఆస్పత్రిలో చేర్చడంతో తనకు డాక్టర్లు క్యాన్సర్ థెరపీ మొదలుపెట్టారు.


ఈ పరిణామాల వల్ల కలిగిన షాక్ నుంచి ఇంకా కోలుకోని నరసో, ఆమె భర్త భజ్‌దేవ్ తమ పిల్లవాడి చికిత్సకయ్యే ఖర్చు కోసం డబ్బు సర్దుబాటుకు పరుగులు తీస్తున్నారు. "మేం ఒక గిరిజన గ్రామం నుంచి వచ్చినవాళ్లం. మా పొట్ట గడవడానికి నేను సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాను. నాకొచ్చే కొద్దిపాటి జీతం తప్పితే మాకింక ఆస్తులేమీ లేవు" అని చెప్పాడు భజ్ దేవ్. ఎలాగోలా కిందామీదా పడి లకిష్‌కి క్యాన్సర్ థెరపీ 2 సైకిళ్లు పూర్తి చేయించారు ఆ నిరుపేద తల్లిదండ్రులు. కానీ, ఆ పిల్లవాడి పరిస్థితి ఇంకా చాలా మెరుగుపడాల్సి ఉంది.


                     ఈ లింక్ పై క్లిక్ చేసి లకిష్‌కి సాయం చెయ్యండి....



"మా అబ్బాయి ఎడమకాలి పరిస్థితి దారుణంగా ఉంది, బహుశా డాక్టర్లు దానిని తొలగిస్తారేమో... చికిత్స కోసం మరింతకాలం ఆగాల్సివస్తే అది వాడి ప్రాణాలకే ముప్పు కావచ్చు" అని ఆ తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. లకిష్ చికిత్స కోసం సుమారుగా  రూ.9,85,000 (డాలర్లలో 13,117.59) వరకూ ఖర్చవుతుంది. కానీ, ఆ నిర్భాగ్య తల్లిదండ్రులకు ఇది చాలాపెద్ద మొత్తం.


నరసో, భజ్ దేవ్‌ల కూతురు మరణించిన తర్వాత వీరికి మిగిలింది లకిష్ మాత్రమే... అతనికి జరగరానిదేమైనా జరిగితే వాళ్లు ఇక కోలుకోలేరు. లకిష్ ఈ గండం నుంచి గట్టెక్కాలంటే మీరందరూ పెద్ద మనస్సుతో ఇచ్చే విరాళాలే ఆధారం. సమయం మించిపోక ముందే అతనిని కాపాడుకునేందుకు మీరు సహకరించండి.

Updated Date - 2022-01-14T21:13:12+05:30 IST