చదువుల తల్లికి సాయం చేయండి

ABN , First Publish Date - 2022-05-27T06:58:35+05:30 IST

చదువుల తల్లి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది.. ఏం చేయాలో తోచక.. ఉన్న ఆస్తి అమ్మినా సరిపోక.. ఆర్థిక సాయానికి ఎదురుచూపులు చూస్తోంది..

చదువుల తల్లికి సాయం చేయండి
లీలా విష్ణు జ్యోతి

అమెరికాలో ఎంఎస్‌ చదివేందుకు లీలా విష్ణు జ్యోతి ఎంపిక

ఆర్థిక ఇబ్బందులతో సతమతం

సాయం చేయాలని తల్లిదండ్రుల వేడుకోలు


కడియం, మే 26 : చదువుల తల్లి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది.. ఏం చేయాలో తోచక.. ఉన్న ఆస్తి అమ్మినా సరిపోక.. ఆర్థిక సాయానికి ఎదురుచూపులు చూస్తోంది.. కడియం మండలం మాధవరాయుడుపాలెం గ్రామానికి చెందిన రైతు మేణ్ని సూర్యప్రకాష్‌-పద్మశ్రీ దం పతులకు ఇద్దరు కుమార్తెలు లీలా విష్ణుజ్యోతి, తులసీశ్యామల. లీలావిష్ణుజ్యోతి సరస్వతీపుత్రిక. మురమండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుకుని.. 9.7 గ్రేడు పాయింట్లు సాధించింది. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేసింది. జీఆర్‌ ఈలో 340 మార్కులకు 305 మార్కులు సాధించింది. ఇంటర్నేషనల్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజెస్‌ టెస్టింగ్‌ సిస్టమ్‌ (ఐఈఏ ఎల్‌టీఎస్‌)లో 9 పాయింట్లకు 6.5 పాయింట్లను సాధించింది.ఆమెరికాలో న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్‌ టెక్నాలజీలో ఎం ఎస్‌ చదివేందుకు అర్హత సాధించింది. రెండేళ్ల పాటు అక్కడ విద్యనభ్యసించాలంటే రూ.90 లక్షల వరకూ ఖర్చవుతోంది.ఈ ఏడాది ఆగస్టులో ఎంఎస్‌ కోర్సుకు న్యూజెర్సీ వెళ్లాల్సి ఉంది.ఏడాదికి రూ.45 లక్షల వరకు ఖర్చవుతుం దని విష్ణుజ్యోతి తెలిపింది.నాకున్న 30 సెంట్ల భూమి అమ్మేద్దామనుకున్నా అంతసొమ్ము రాదు.. అందుకే దాతలు సాయం చేయాలని తండ్రి సూర్యప్రకాష్‌ కోరుతున్నాడు.


Updated Date - 2022-05-27T06:58:35+05:30 IST