ప్లీజ్.. KTR అంకుల్‌.. వీధి శునకాల నుంచి విముక్తి కల్పించండి..!

ABN , First Publish Date - 2022-03-07T12:35:09+05:30 IST

ప్లీజ్.. KTR అంకుల్‌.. వీధి శునకాల నుంచి విముక్తి కల్పించండి..!

ప్లీజ్.. KTR అంకుల్‌.. వీధి శునకాల నుంచి విముక్తి కల్పించండి..!

  • ప్లకార్డులతో చిన్నారుల ర్యాలీ


హైదరాబాద్ సిటీ/పేట్‌బషీరాబాద్‌ : ‘‘కమిషనర్‌ అంకుల్‌.. ఎమ్మెల్యే అంకుల్‌, కేటీఆర్‌ అంకుల్‌ వీధి శునకాల నుంచి విముక్తి కల్పించండి. రేబిస్‌ బారిన పడకుండా కాపాడండి’’ అంటూ ప్లకార్డులు పట్టుకుని చిన్నారులు ర్యాలీ నిర్వహించారు. కొంపల్లి మున్సిపల్‌ పరిధి నార్త్‌ ఎన్‌సీఎల్‌లో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ వీధి కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ వాహనదారులు, పాదచారులపై విరుచుకుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో చిన్నా, పెద్ద తేడా లేకుండా ఇప్పటి వరకు సుమారు 70 మంది వీధి కుక్కల బారిన పడ్డారని, బాధితుడు ప్రణీత్‌రెడ్డి ముఖానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేశారని తెలిపారు. ఏడాది కాలంగా వీధి కుక్కల దాడులు పెరిగాయన్నారు. మున్సిపల్‌ అధికారుల, ప్రజా ప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారని విమర్శించారు.

Updated Date - 2022-03-07T12:35:09+05:30 IST