అభ్యంతరాలుంటే తెలియజేయండి

ABN , First Publish Date - 2022-10-08T04:44:45+05:30 IST

కడప-రేణిగుంట జాతీయ నాలుగులైన్ల రోడ్డు విస్తరణ నష్టపరిహారం విషయంలో అభ్యంతరాలుంటే భూములు కోల్పోయిన రైతులు కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని.. జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా తెలిపారు. శుక్రవారం రైల్వేకోడూరు తహసీల్దార్‌ కార్యాలయ సభా భవనంలో భూములు కోల్పోయిన రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

అభ్యంతరాలుంటే తెలియజేయండి
రైతులతో మాట్లాడుతున్న జేసీ తమీమ్‌ అన్సారియా

భూములు కోల్పోయిన రైతులతో జేసీ సమావేశం 

రైల్వేకోడూరు, అక్టోబరు 7: కడప-రేణిగుంట జాతీయ నాలుగులైన్ల రోడ్డు విస్తరణ నష్టపరిహారం విషయంలో అభ్యంతరాలుంటే భూములు కోల్పోయిన రైతులు కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని.. జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా తెలిపారు. శుక్రవారం రైల్వేకోడూరు తహసీల్దార్‌ కార్యాలయ సభా భవనంలో భూములు కోల్పోయిన రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పట్టా, డీకేటీ భూములకు రేట్లు వేర్వేరుగా ఉంటాయని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏరియా, మార్కెట్‌ విలువను బట్టి రైతులకు పరిహారం ఇస్తామన్నారు. రైతులకు ప్రభుత్వం తప్పక న్యాయం చేస్తుందని, ఎక్కడా తప్పులు జరగకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో రాజంపేట ఆర్డీఓ కోదండరామిరెడ్డి, రైల్వేకోడూరు తహసీల్దార్‌ బి.రామమోహన్‌, కె.బుడుగుంటపల్లె, కన్నెగుంట, వీపీఆర్‌ కండ్రిక, సూరపురాజుపల్లె, శెట్టిగుంట తదితర ప్రాంతాల రైతులు పాల్గొన్నారు.

-రైతులకు ఎకరాకు రూ.15 లక్షలు ఇవ్వాలి

కడప-రేణిగుంట జాతీయ రహదారి వల్ల నష్టపోయే రైతులకు ఎకరాకు రూ.15 లక్షలు పరిహారం అందించాలని రైల్వేకోడూరు సీపీఐ సీనియర్‌ నాయకుడు మణి డిమాండ్‌ చేశారు. శుక్రవారం రైల్వేకోడూరుకు వచ్చిన జేసీ తమీమ్‌ అన్సారియాకు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ భూములు కోల్పోయిన ప్రతి రైతుకు 5 సెంట్ల స్థలం పరిహారంగా ఇవ్వాలని, ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా అసైన్‌మెంట్‌ కమిటీ సమావేశంలో జాతీయ గుర్తింపు పొందిన పార్టీ నాయకులకు చేర్చాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ చంద్రశేఖర్‌ జేసీని కోరారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు మహబూబ్‌బాషా, గంగయ్య, సుబ్బనరసయ్య, శంకరయ్య, గంగమ్మ, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-08T04:44:45+05:30 IST