ఎన్ఐసీయూలో కవల పిల్లలు... చెదిరిపోయిన కన్న గుండెలు

ABN , First Publish Date - 2020-12-28T20:55:02+05:30 IST

"ఏన్నో ఏళ్ళ పాటు వేచి చూసిన తర్వాత మేం అమ్మానాన్నలమయ్యాం. మాకు కవల పిల్లలు పుట్టిన తర్వాత మా ఆనందానికి హద్దే లేదు. ఈ క్షణాల కోసమే మేం ఎంతో కాలం నుంచీ కన్నులు కాయలు కాచేలా ఎదురు చూశాం...

ఎన్ఐసీయూలో కవల పిల్లలు... చెదిరిపోయిన కన్న గుండెలు

"ఏన్నో ఏళ్ళ పాటు వేచి చూసిన తర్వాత మేం అమ్మానాన్నలమయ్యాం. మాకు కవల పిల్లలు పుట్టిన తర్వాత మా ఆనందానికి హద్దే లేదు. ఈ క్షణాల కోసమే మేం ఎంతో కాలం నుంచీ కన్నులు కాయలు కాచేలా ఎదురు చూశాం. చివరికి మా ప్రార్థనలు ఫలించాయి, కానీ ఆ ఆనందం కొద్దిసేపైనా నిలువకముందే పీడకలగా మారిపోయింది. పిల్లలిద్దరూ నెలలు నిండకముందే చాలా ప్రీమెచ్యూర్‌గా పుట్టడంతో వారి చికిత్సకయ్యే ఖర్చులు భరించడం మాకు చాలా కష్టంగా మారింది" అంటూ కన్నీటి పర్యంతమైంది ఆ చిన్నారుల కన్నతల్లి స్వరూప.


స్వరూప, శ్రీనజ దంపతులకు 9 ఏళ్ళ కిందట పెళ్ళయింది. కవలలుగా ఇద్దరు పిల్లలు పుట్టినప్పటికీ, ప్రీమెచ్యూర్ కావడంతో చికిత్స కోసం వీరిని NICUలోనే ఉంచాల్సి వచ్చింది. అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెందక జీవన పోరాటం చేస్తున్న ఆ పసిమొగ్గలను కాపాడుకోవడానికి లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ అమర్చారు. చిన్నారులిద్దరి పరిస్థితి ప్రస్తుతం సంక్లిష్టంగా ఉందన్న వైద్యులు, వారిని కనీసం 4-5 వారాల పాటు NICUలోనే ఉంచాలన్నారు.




పసివారిద్దరికీ వైద్యం కొనసాగుతున్నప్పటికీ, చికిత్స కోసం ఆ కుటుంబం దగ్గరున్న డబ్బు కాస్తా ఖర్చయిపోతోంది. ఈ చికిత్సకయ్యే ఖర్చు రూ.20 లక్షలు (సుమారు 27,186 డాలర్లు) వారికి భరించలేని భారం. ఈ పిల్లల తండ్రి శ్రీనజ మాత్రమే ఆ కుటుంబానికి ఏకైక ఆధారం. శ్రీనజకు వచ్చే ఆ కాస్త ఆదాయం ఆ పిల్లల మెడిసిన్స్‌కే చాలీచాలని పరిస్థితి. ఇక వైద్య ఖర్చుల సంగతి ఊహించనంత భారం.


"మా పాపాయిలను కాపాడుకోవడానికి అవసరమైన డబ్బు విషయంలో నాకు సాయం చేసేవారు గానీ, అప్పు ఇచ్చేవారు గానీ ఎవ్వరూ లేరు. పిల్లల ఆరోగ్యం స్థిరంగా లేకపోవడంతో వారిని ప్రభుత్వాసుపత్రికి కూడా మార్చలేను. చాలాకాలానికి మేము తల్లిదండ్రులం అయ్యామనుకుంటే, చేతికందిన అమృతాన్ని తిరిగి లాక్కున్నంత బాధగా ఉంది. నాపిల్లల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు" అంటూ రోదిస్తున్నాడు ఆ పసిబాలల కన్నతండ్రి శ్రీనజ.


ఈ లింక్‌పై క్లిక్ చేసి ఈ చిన్నారుల చికిత్సకు మీ సహాయాన్ని అందించండి



లోకం తెలియని ఈ పసిపిల్లల తల్లిదండ్రుల గుండెలు చెదిరిపోయాయి. వెంటిలేటర్ల ద్వారా ఊపిరి తీసుకుంటూ... ప్రతి శ్వాసకూ ఆయాసపడుతూ... NICUలో ఇబ్బంది పడుతున్న తమ కుమార్తెల పరిస్థితి వారికి తీవ్ర మనోవేదన కలిగిస్తోంది. చికిత్సకయ్యే ఖర్చు ఎలా సర్దుబాటు చెయ్యాలో అర్థంగాక రాత్రివేళ నిద్రపట్టని నిస్సహాయ స్థితి. తమ పాపాయిలు తమకు దక్కుతారా?... అనే ఊహే ఆ తల్లిదండ్రులకు భరించలేని ఆందోళన కలిగిస్తోంది.


కానీ, స్వరూప, శ్రీనజ ఆశ వదులుకోలేదు. పిల్లల కోసం పోరాటం చెయ్యాలని నిశ్చయించుకున్నారు. ఆహార అవసరాలను కుదించుకున్నారు. వైద్యానికయ్యే డబ్బు కోసం తమ విలువైన ఆభరణాలను అమ్మేశారు. కానీ, పిల్లల వైద్యానికి మొత్తంగా అవసరమైన సొమ్ముకు వారి దగ్గరున్న డబ్బు  ఏమాత్రం సరిపోలేదు. 


ఇప్పుడు ఈ నిరుపేద తల్లిదండ్రులకున్న ఏకైక దిక్కు మీరే... ఈ చిన్నారుల చికిత్సకయ్యే ఖర్చుకు చేయూతనివ్వండి. ఉదార హృదయంతో విరాళాలిచ్చి వారిని కాపాడండి.





Updated Date - 2020-12-28T20:55:02+05:30 IST