బడిలో ఉండాల్సిన వర్షిత్ బెడ్‌పై ఉన్నాడు....

ABN , First Publish Date - 2020-08-14T22:45:28+05:30 IST

బడిలో ఉండాల్సిన వర్షిత్ బెడ్‌పై ఉన్నాడు....

బడిలో ఉండాల్సిన వర్షిత్ బెడ్‌పై ఉన్నాడు....

"వర్షిత్‌ని ఈ ఏడాదే బడిలో చేర్చుదామనుకున్నాం కానీ, వాడిప్పుడు ఆసుపత్రిలో జీవితం కోసం పోరాడుతున్నాడు. రక్తానికి సంబంధించిన ఏదో అరుదైన సమస్యతో ఇంత చిన్న వయసులో మా అబ్బాయి అలా బాధపడుతుండటం మాకెంతో బాధ కలిగిస్తోంది" అని దయమ్మ, కృష్ణ ఆవేదన చెందుతున్నారు.


లోకం తెలియని 3.5 ఏళ్ళ చిన్నారి వర్షిత్ అమ్మానాన్నలే దయమ్మ, కృష్ణ. వర్షిత్ severe aplastic anaemiaగా పేర్కొనే రక్త సంబంధమైన ఒక అరుదైన సమస్యతో బాధపడుతున్నాడు. ఈ సమస్య వల్ల తన ఒంట్లో రక్త కణాల తయారీ ఆగిపోతుంది. వర్షిత్ బ్రతకాలంటే అత్యవసరంగా బోన్ మేరో ట్రాన్స్‌ప్లాంట్ చెయ్యాలని డాక్టర్లు చెప్పారు.


ఇదొక్కటే కాదు, వర్షిత్‌కు తరచుగా రక్తమార్పిడి కూడా చెయ్యాల్సి వస్తోంది. కానీ, ఈ ప్రక్రియ వల్ల తను శక్తిని కోల్పోతున్నాడు. రోజంతా ఆ చిన్నారి అలసిపోతున్నాడు. తన శరీరం పాలిపోతోంది, బరువు తగ్గిపోయాడు. తమ కళ్ళముందే కన్నబిడ్డ ఇంత బాధ అనుభవించడం ఆ తల్లిదండ్రులు భరించలేకపోతున్నారు.


Click Here to Contribute / know more details


ఈ ఏడాది మే నెలలో తనకు కడుపు నొప్పిగా ఉందని వర్షిత్ చెప్పాడు. కొన్ని రోజులయ్యాక తన నోటి నుంచి రక్తం కారడం, మలంలోనూ రక్తం పడటం అతని తల్లిదండ్రులు గమనించారు. ఎంతో ఆందోళనతో తమ కొడుకును వెంటనే దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళారు.


మొదట్లో డాక్టర్లు 20 రోజుల పాటు వర్షిత్‌ను అడ్మిట్ చేసుకున్నారు కానీ, తనకు వచ్చిన వ్యాధి ఏమిటన్నది అక్కడి వైద్య సిబ్బంది డయాగ్నోస్ చెయ్యలేకపోయారు. చివరికి వర్షిత్ అమ్మానాన్నల దగ్గరున్న కాస్త డబ్బూ వైద్య ఖర్చులకే అయిపోయింది. ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో వర్షిత్ ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేకపోయినా ఆసుపత్రి నుంచి తీసుకువచ్చేశారు.


తమ బంధువులు, మిత్రుల నుంచి కొంత డబ్బు అప్పు చేసి చెన్నైలో పిల్లల వైద్యం కోసం ఉన్న స్పెషాలిటీ ఆసుపత్రి రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు వర్షిత్‌ని తీసుకెళ్ళారు. తను aplastic anaemiaకు గురైనట్లు అక్కడ తెలిసింది.




ఈ రెయిన్‌బో చిల్డ్రన్స్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వర్షిత్‌ను చేర్చి నెల రోజులు దాటింది. తను కోలుకుంటున్న లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ అవి తాత్కాలికమేనని డాక్టర్లు చెబుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం బోన్ మేరో ట్రాన్స్‌ప్లాంటేషన్ మాత్రమే. పరిష్కారం ఒకటి ఉందన్న విషయం ఆ తల్లిదండ్రులకు కాస్త ఉపశమనం కలిగించినా.... అందుకు సుమారు రూ.25 లక్షల వరకూ ఖర్చవుతుందని తెలుసుకుని వారు నిస్సహాయులై తీవ్ర నిరాశకు గురయ్యారు. 


వర్షిత్ తండ్రి కృష్ణ క్లర్క్‌గా పనిచేసేవాడు. అప్పట్లో ఆయన ఆదాయం కేవలం కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి సరిపోయేది. ప్రస్తుతం ఆయనకు ఉద్యోగం లేకపోవడంతో ఆదాయాన్ని కోల్పోయాడు. ఇప్పటికే తాము పొదుపు చేసిన సొమ్మును వర్షిత్ వైద్యం కోసం ఖర్చు చేశారు. చివరికి అప్పులు చేశారు, తమ దగ్గరున్న విలువైన వస్తువులు అమ్మారు కానీ అవేవీ వారి కష్టాన్ని తీర్చలేదు.


వర్షిత్‌కు ఇప్పుడు మీ సహాయం కావాలి... పెద్ద మనసుతో ఇక్కడే సాయం చేయండి


బడికి వెళ్ళి చక్కగా చదువుకోవలసిన చిన్నారి వర్షిత్... ఇప్పుడు ఆసుపత్రి బెడ్ నుంచి జీవిత పోరాటం చేస్తున్నాడు. ఈ పరిస్థితుల వల్ల మానసికంగా కుంగిపోయిన అతని తల్లిదండ్రులు మీ సహాయం కోసం అర్ధిస్తున్నారు. వర్షిత్‌ని కాపాడేందుకు పెద్ద మనసు చేసుకుని ఉదారంగా విరాళాలిచ్చేందుకు ముందుకు రమ్మని కోరుతున్నాం....

Updated Date - 2020-08-14T22:45:28+05:30 IST