నెలలు నిండక ముందే పుట్టిన పసిప్రాణానికి మీరే దిక్కు

Sep 11 2021 @ 15:42PM

"ఏమండీ.... ఈ బాధ భరించలేకపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యండి ప్లీజ్... ఏదో ఒకటి!" అంటూ ఆ రోజున నా భర్త గణేశన్ దగ్గర వెక్కి వెక్కి ఏడ్చేశాను.


"లోగేశ్వరీ, మనం దగ్గరకి వచ్చేశాం. నీ కళ్ళు మూతపడనీకు. నన్నే చూస్తుండు. మనం అమ్మానాన్నలం కాబోతున్నాం..." అని బాధతో విలవిలలాడుతూ స్ట్రెచర్ మీద ఉన్న నన్ను చూస్తూ నా చేతులు గట్టిగా పట్టుకుని నర్సులతో పాటు నడుస్తున్నాడు నాభర్త. 


గర్భంతో ఉన్న నేను అప్పుడే 25వ వారంలోకి అడుగుపెట్టాను. ప్రసవ సంబంధమైన నొప్పులు అప్పుడే మొదలవుతున్నాయి. ఆ రాత్రి నేను ప్రసవించడానికి ముందు నా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి, నా కాళ్ళు ఉబ్బిపోయాయి. కానీ, తీవ్రస్థాయిలో రక్తస్రావం జరుగుతూ నా ఉమ్మనీరు బయటకు వచ్చేస్తుండటంతో పరిస్థితులు చెయ్యిదాటిపోయినంత పనైంది.


నా పక్కనే ఉన్న డాక్టర్లు, నర్సులు పరుగులు తీస్తున్నారు. నాకు జాగ్రత్తగా ప్రసవం చేసి బిడ్డను క్షేమంగా ఈ లోకంలోకి తీసుకురావడానికి చెయ్యగలిగిందంతా చేస్తున్నారు. ఈ పనంతా నాకు ఎంతో బాధ మధ్య చాలా ఎక్కువసేపు జరిగింది. ఏదో మరో లోకంలో ఉన్నట్టనిపించింది. డాక్టర్లు వారి పని పూర్తి చేసిన తర్వాత నర్స్ నా దగ్గరకొచ్చి అమ్మాయి పుట్టిందంటూ కంగ్రాట్స్ చెప్పింది. ఆ మాట వినగానే నా ఆనందం అవధులు దాటింది. దేవుడి దయవల్ల నేను పడ్డ వేదన వృధా కాలేదు. 


అయితే, బిడ్డను చూపించమని నర్సును అడిగినప్పుడు ఆమె చాలా సందేహించింది. పాపాయి నెలలు నిండకుండా చాలా ముందే పుట్టడం వల్ల అత్యవసర చికిత్స కోసం NICUలో పెట్టామని నర్సు చెప్పింది.


సాయం చేయడానికి క్లిక్ చేయండి

నా గుండె బద్దలైంది. దాదాపు ఏడాది కిందట ప్రసవ సమస్యల వల్లే మేం ఇప్పటికే ఒక బిడ్డను పోగొట్టుకున్నాం. అప్పుడు మేం అనుభవించిన వేదన, దుఃఖం మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. నా భర్త గణేశన్ నాదగ్గరకు వచ్చినప్పుడు ఏడవటం తప్ప ఇంకేం చెయ్యలేకపోయాను. ఎందుకేడుస్తున్నావని తను నన్ను ఓదార్చడానికి ఎంతో ప్రయత్నించాడు కానీ, నా వల్ల కాలేదు.


కాస్త ఓపిక వచ్చిన తర్వాత, చివరికి మా పాపాయి చేస్తున్న జీవన్మరణ పోరాటం గురించి నా భర్తకు వివరించాను. మా పాపాయిని కాపాడటానికి చెయ్యగలిగిందంతా చెయ్యవలసిందని డాక్టర్లను వేడుకున్నాము. వాళ్ళు మమ్మల్ని ఓదార్చి, మా చిట్టితల్లిని కాపాడాలంటే తనను NICUలోనే ఉంచి ఆస్పత్రిలోనే ఎక్కువ కాలం పాటు చికిత్స చెయ్యాల్సి ఉంటుందన్నారు. కానీ, అంతటితో అయిపోలేదు.


ఈ చికిత్సకు దాదాపుగా రూ.10 లక్షలు ($ 13702.69) ఖర్చవుతుందని చెప్పారు. మా జీవితంలో ఏనాడూ అంత మొత్తం చూసి ఎరగం. నేను ఒక మామూలు ఇల్లాలిని. నా భర్త ఒక్కడే సంపాదిస్తాడు. కూలీగా పనిచేస్తూ వచ్చే చాలీచాలని సంపాదనతోనే మాకు రోజు గడుస్తుంది. ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద మొత్తాన్ని సర్దుబాటు చెయ్యడం మావల్ల అయ్యే పని కాదు.


మాకిప్పుడు మీరే దిక్కు. మీరు దయతో ఇచ్చే ప్రతి రూపాయినీ మా అమ్మాయిని కాపాడుకోవడానికే ఉపయోగించుకుంటాం.


నేను నా భర్త మా చిట్టి పాపాయి బోసి నవ్వులతో బతకడానికి పెద్ద మనస్సు చేసుకుని, భరోసా ఇవ్వండి.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.