సర్వసభ్య సమావేశం బహిష్కరణ

ABN , First Publish Date - 2021-01-24T06:00:03+05:30 IST

విధులు, నిధులు, గౌర వం కల్పించాలని శని వారం ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు చందుర్తి మండల పరిషత్‌ సర్వ సభ్య సమావేశాన్ని బహిష్కరించారు.

సర్వసభ్య సమావేశం బహిష్కరణ
బైఠాయించిన ప్రతిపక్షపార్టీల ప్రజాప్రతినిధులు

చందుర్తి,జనవరి 23: విధులు, నిధులు, గౌర వం కల్పించాలని శని వారం  ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు చందుర్తి మండల పరిషత్‌ సర్వ సభ్య సమావేశాన్ని  బహిష్కరించారు. స మావేశం ప్రారంభంకావడంతోనే కాంగ్రెస్‌ జడ్పీటీసీ నాగం కుమార్‌, ఎంపీటీసీలు రేణుక, గణేష్‌, బీజేపీకి చెందిన  రణధీర్‌రెడ్డి, సర్పంచులు  ప్రేమలత, దేవేంద్ర, జలపతి సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చారు. కార్యాలయం ఎదుట  బైఠాయించారు.  సమస్యలు పర్కిష్క రిం చాలని నినాదాలు చేశారు. ఉరితాళ్లతో నిరసన తెలిపేందుకు ప్రయ త్నిం చగా పోలీసులు తీసుకున్నారు. జడ్పీటీసీ నాగం కుమార్‌ మాట్లాడుతూ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు గెలుపొంది ఏడాది దాటినా నిధులు మంజూరు కాలేదన్నారు. అనంతరం ఏఎస్సై సోనా ఆందోళనను విరమింపజేశారు.

 

సర్వసభ్య సమావేశం వాయిదా 

 ప్రతి పక్ష పార్టీల ప్రజా ప్రతినిధులు బహిష్కరించడంతో సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేసినట్లు ఎంపీపీ బైరగొని లావణ్య ప్రకటించారు. 

Updated Date - 2021-01-24T06:00:03+05:30 IST