IPL: టాస్ గెలిచి విలియమ్సన్‌ను టీజ్ చేసిన డుప్లెసిస్

ABN , First Publish Date - 2022-05-09T01:23:44+05:30 IST

ఈ ఐపీఎల్‌లో టాస్ వీరుడు ఎవరయ్యా అంటే అది కేన్ విలియమ్సనే (Kane Williamson). టాస్‌ల

IPL: టాస్ గెలిచి విలియమ్సన్‌ను టీజ్ చేసిన డుప్లెసిస్

ముంబై:  ఈ ఐపీఎల్‌లో టాస్ వీరుడు ఎవరయ్యా అంటే అది కేన్ విలియమ్సనే (Kane Williamson). టాస్‌ల విషయంలో అదృష్టమంతా విలియమ్సన్‌నే వరిస్తూ వచ్చింది. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌తో కలిపి ఇప్పటి వరకు 11 మ్యాచ్‌ల్లో 9సార్లు విలియమ్సన్‌నే టాస్ వరించింది. అయితే, ఈ మ్యాచ్‌లో మాత్రం బెంగళూరు కెప్టెన్ ఫా డుప్లెసిస్‌ (Faf du Plessis) టాస్ గెలిచి విలియమ్సన్ ‘టాస్’ విజయాలకు అడ్డుకట్ట వేశాడు. టాస్ గెలిచిన వెంటనే విలియమ్సన్‌ను చూసి టీజ్ చేస్తూ బ్యాటింగ్ ఎంచుకున్నట్టు డుప్లెసిస్ చెప్పాడు. 


ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 192 పరుగుల భారీ స్కోరు సాధించగా, ప్రతిగా 125 బంతులకే ఆలౌట్ అయిన హైదరాబాద్ ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమితో హైదరాబాద్ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్టే. మరోవైపు, ఈ మ్యాచ్‌లో నెగ్గిన ఆర్సీబీ 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.   

Read more