కరోనా నియంత్రణలో పీఎం, సీఎం విఫలం

ABN , First Publish Date - 2021-05-09T06:22:49+05:30 IST

కరోనా నియంత్రణ విషయంలో ప్ర ధాని నరేంద్ర మోదీ, ముఖ్యమం త్రి వైఎస్‌ జగన విఫలమయ్యారని టీడీపీ మండిపడింది.

కరోనా నియంత్రణలో పీఎం, సీఎం విఫలం
వ్యాక్సిన అందరికీ వేయాలని అనంతపురంలో ఇతర నాయకులతో కలిసి నిరసన తెలుపుతున్న ప్రభాకరచౌదరి

 మహమ్మారికి బలవుతున్న జనం..

 వ్యాక్సిన అందరికీ వేయాల్సిందే..

 జిల్లా వ్యాప్తంగా టీడీపీ నిరసన

అనంతపురం వైద్యం, మే 8:  కరోనా నియంత్రణ విషయంలో ప్ర ధాని నరేంద్ర మోదీ, ముఖ్యమం త్రి వైఎస్‌ జగన విఫలమయ్యారని టీడీపీ మండిపడింది. కరోనా వి జృంభిస్తున్నా కనీసం వ్యాక్సిన అందించలేకపోతున్నారని, అం దరికీ వ్యాక్సిన వేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టారు. పార్టీ ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు, శ్రేణులతో కలిసి కరోనా నిబంధనలు పాటిస్తూ తమ నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంలో టీడీపీ నాయకులు వే ర్వే రుగా తమ కార్యాలయాలు, ఇళ్ల వద్ద నిరసన వ్యక్తం చే శారు. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి నియోజక వర్గ కార్యాలయంలో... 18 ఏళ్ల పైబడిన వారందరికి కరోనా వ్యాక్సిన వేయాలని డిమాండ్‌ చేస్తూ శ్రేణులతో కలిసి నిరసన చేప ట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా బాఽ ధి తులకు అవసరమైన మందులు, ఆక్సిజన, వసతులు కల్పిం చలేకపోతున్నారని ఆరోపించారు. సరైన వైద్య చికిత్సలు అం దించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అందుకే రోజు కొవిడ్‌ ఆస్పత్రుల్లో అనేక మంది చనిపోతున్నారన్నారు. ప్రభు త్వ వైఫల్యాలను ప్రశ్నించారని టీడీపీ అధినేత చంద్రబాబు పై కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నిరసనలో టీడీపీ నాయకులు దేవళ్ల మురళి, మారుతీగౌడ్‌, న రసింహులు, సర్దార్‌ వలి, డిష్‌నాగరాజు, వెంకటేష్‌గౌడ్‌, సు రేంద్ర, గోపాల్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర కా ర్యదర్శి తలారి ఆదినారాయణ తమ నివాసంలో, మరో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుగ్గయ్య చౌదరి ఆధ్వర్యంలో రోడ్డుపై టీడీపీ నాయకులు రాజు, మదన, నంబూరి రమణ, సరిత, రమాదే వి, గురుతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన గౌస్‌మోద్దీన, తెలుగు యువత నాయకులు లింగారెడ్డి, మణిరవి, జాఫర్‌, రఫీ, రాము, సూరి, సతీష్‌రెడ్డి, చంద్రశేఖర్‌ తదితరులు వ్యాక్సిన పంపిణీలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వెంటనే అందరికి వ్యాక్సిన వేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసన తెలియజేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా వ్యాక్సిన కోసం టీడీపీ పోరు సాగించింది.


Updated Date - 2021-05-09T06:22:49+05:30 IST