PM Kisan eKYC: పీఎం కిసాన్ నిధి పథకం కేవైసీకి 3 రోజులే గడువు

ABN , First Publish Date - 2022-08-29T17:31:45+05:30 IST

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(Pradhan Mantri Kisan Samman Nidhi) పథకం కింద అర్హులైన రైతులకు ఈకేవైసీ( PM Kisan eKYC) తప్పనిసరి...

PM Kisan eKYC: పీఎం కిసాన్ నిధి పథకం కేవైసీకి 3 రోజులే గడువు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(Pradhan Mantri Kisan Samman Nidhi) పథకం కింద అర్హులైన రైతులకు ఈకేవైసీ( PM Kisan eKYC) తప్పనిసరి అని కేంద్రం తెలిపింది. ఈ పథకం కింద పీఎం కిసాన్ నిధులు పొందడానికి రైతులు ఈకేవైసీ చేసుకోవడానికి మూడు రోజులే గడవు ఉందని కేంద్రం పేర్కొంది. పీఎం కిసాన్ పథకం((PM-KISAN) కింద లబ్ధి పొందే రైతులు ఆగస్టు 31వతేదీలోగా ఈకేవైసీ(eKYC deadline) ఫార్మాలిటీని పూర్తి చేసుకోవాలని కేంద్రం సూచించింది. పీఎం కిసాన్ పథకం కింద ఈకేవైసీ చేసుకునేందుకు ప్రభుత్వం గతంలో జులై 31వతేదీ చివరితేదీ అని ప్రకటించింది. ఈ గడవును ఆగస్టు 31వతేదీ వరకు పొడిగించింది.


 పీఎం కిసాన్ పోర్టల్ లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్న రైతులు ఓటీపీ బేస్‌డ్ ఈకేవైసీ (నో యువర్ కస్టమర్) చేయించుకోవాలని కేంద్రం కోరింది. లేదా రైతులు వారి సమీపంలోని కస్టమర్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి బయోమెట్రిక్ బేస్‌డ్ ఈకేవైసీ చేయించుకోవచ్చని కేంద్ర అధికారులు సలహా ఇచ్చారు. ఆధార్ నంబరు సాయంతో ఓటీపీ బేస్ డ్ ఈకేవైసీ చేయించుకునే రైతులు ఈ కింద ఇచ్చిన లింకును క్లిక్ చేయవచ్చు.https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx. రైతులు(farmers) పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రైతుల కార్నర్ ద్వారా ఈకేవైసీ ట్యాబ్ ను క్లిక్ చేయవచ్చు.రైతులు వారి ఆధార్ నంబరును(Aadhaar number) ట్యాబ్ లో సెర్చ్ చేసి మీ మొబైల్ నంబరుకు వచ్చే నాలుగు అంకెల డిజిట్ ఓటీపీని సబ్ మిట్ చేయాలి. 

 


ఆధార్ నంబర్, ఓటీపీ సబ్ మిట్ చేస్తే ఈకేవైసీ ప్రాసెస్ పూర్తి అవుతుంది. ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులకు రెండు వేలరూపాయల ఇన్ స్టాల్ మెంట్(PM Kisan installment)వారి ఖాతాల్లో కేంద్రం జమ చేయనుంది. 2019వ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) రైతుల కోసం ప్రారంభించిన పీఎం కిసాన్ పథకం కింద 10 కోట్ల మంది రైతులకు రూ.21,000కోట్లను మే 31వతేదీన వారి ఖాతాల్లో జమ చేశారు. 

Updated Date - 2022-08-29T17:31:45+05:30 IST