త్వరలో రైతుల ఖాతాల్లోకి PM KISAN 11వ విడత నిధులు

ABN , First Publish Date - 2022-05-19T17:55:29+05:30 IST

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కింద 11వ విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి.....

త్వరలో రైతుల ఖాతాల్లోకి PM KISAN 11వ విడత నిధులు

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కింద 11వ విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద తదుపరి విడత రూ.2000 పంపిణీ కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్ పథకాన్ని 2019వసంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు, కొన్ని మినహాయింపులకు లోబడి సాగు భూమి ఉన్న రైతు కుటుంబాలకు ఆదాయ అందించడం లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద, సంవత్సరానికి రూ.6వేల మొత్తాన్ని మూడు వాయిదాలలో ఒక్కొక్కటి రూ.2000 చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి వేస్తారు. తమ పేర్లపై సాగు భూమి ఉన్న రైతుల కుటుంబాలన్నీ ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులని కేంద్రం తెలిపింది.


రాజ్యాంగ పదవులున్న వారు, మాజీ ప్రస్తుత మంత్రులు, రాష్ట్ర మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్ర శాసన మండలి మాజీ,ప్రస్తుత సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్‌ల మాజీ,ప్రస్తుత మేయర్‌లు, జిల్లా పంచాయతీల మాజీ, ప్రస్తుత అధ్యక్షులు, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల కార్యాలయాలు,స్థానిక సంస్థల సాధారణ ఉద్యోగులు పనిచేస్తున్న లేదా పదవీ విరమణ పొందిన అధికారులు, ఉద్యోగులు పీఎం కిసాన్ పథకం పొందేందుకు అర్హులు కాదని అధికారులు చెప్పారు. గత అసెస్‌మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులందరూ ఈ పథకం పొందటానికి అనర్హులని అధికారులు వివరించారు.


Updated Date - 2022-05-19T17:55:29+05:30 IST