‘జమిలి ఎన్నిక’పై చెప్పకనే చెప్పేసిన ప్రధాని మోదీ!

ABN , First Publish Date - 2020-11-26T22:31:50+05:30 IST

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ జమిలీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలీ ఎన్నికలపై ఎలాంటి

‘జమిలి ఎన్నిక’పై చెప్పకనే చెప్పేసిన ప్రధాని మోదీ!

న్యూఢిల్లీ : రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలపై ఎలాంటి చర్చా అవసరం లేదని, అయితే దేశానికి మాత్రం అవి అత్యంత ఆవశ్యకమని నొక్కి వక్కాణించారు. అసెంబ్లీ, స్థానిక సంస్థలు, లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం వేర్వేరు ఓటరు జాబితాలను రూపొందిస్తోందని, అలా రూపొందించడం అంటే వనరులను వృథా చేయడమే అని ఆయన అభిప్రాయపడ్డారు. 80వ ‘ఆలిండియా ప్రిసైడింగ్స్ ఆఫీసర్స్’ జాతీయ సదస్సును ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... ‘‘జమిలి ఎన్నికలపై చర్చ అనవసరం. దేశానికి అవి అత్యంత ఆవశ్యకం. కొన్ని నెలల వ్యత్యాసాల్లోనే దేశంలో ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటున్నాయి. దీంతో అభివృద్ధి కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడుతోందన్న విషయం ప్రజానీకానికి అర్థమవుతూనే ఉంది. ఈ సమస్యను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై ప్రిసైడింగ్ అధికారులు తగిన మార్గదర్శనం చేయాల్సిన ఆవశ్యకం ఉంది.’’ అని మోదీ పేర్కొన్నారు. 

Updated Date - 2020-11-26T22:31:50+05:30 IST