నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోదీ ఫోన్

ABN , First Publish Date - 2021-05-09T19:16:54+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు

నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోదీ ఫోన్

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులపై చర్చించారు. తమ రాష్ట్రాల్లో తాము చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రులు వివరించారు. 


పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్‌లకు మోదీ ఫోన్ చేశారు. 


ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4,01,078 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఈ వ్యాధివల్ల 4,187 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం 4.12 లక్షల కేసులు, శుక్రవారం 4.14 లక్షల కేసులు కొత్తగా నమోదైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2,18,92,676కి చేరింది. 


Updated Date - 2021-05-09T19:16:54+05:30 IST