భారతీయులకు రష్యా సేఫ్ ప్యాసేజ్

ABN , First Publish Date - 2022-03-03T00:37:08+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం రష్యా అధ్యక్షుడు

భారతీయులకు రష్యా సేఫ్ ప్యాసేజ్

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను రష్యా మీదుగా తరలించేందుకు సహకరించాలని కోరారు. భారతీయ విద్యార్థుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదిలావుండగా, ఖర్కివ్‌ నుంచి భారతీయులు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటల్లోగా వెళ్ళిపోవాలని ఇండియన్ ఎంబసీ హెచ్చరించింది. ఇక్కడి నుంచి పెసోచిన్, బాబే, బెజ్లిడోవ్కా నగరాలకు త్వరగా వెళ్లాలని ఆదేశించింది. 


భారతీయులకు 6 గంటల పాటు రష్యా వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9:30 గంటల వరకు గడువు ఇచ్చినట్లు సమాచారం. ఉక్రెయిన్ నుంచి రష్యా మీదుగా భారత దేశానికి వెళ్ళేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి 9:30 గంటల తర్వాత ఖర్కివ్‌ను స్వాధీనం చేసుకునేందుకు చిట్టచివరి అస్త్రాన్ని ప్రయోగించేందుకు రష్యా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 


Updated Date - 2022-03-03T00:37:08+05:30 IST