ఉద్దవ్ థాకరేపై మోదీ ప్రశంసల జల్లు

ABN , First Publish Date - 2021-05-08T22:45:15+05:30 IST

మహారాష్ట్రలో కోవిడ్-19 మహమ్మారి కట్టడికి తీసుకుంటున్న

ఉద్దవ్ థాకరేపై మోదీ ప్రశంసల జల్లు

న్యూఢిల్లీ : మహారాష్ట్రలో కోవిడ్-19 మహమ్మారి కట్టడికి తీసుకుంటున్న చర్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. శనివారం ఆయన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో రాష్ట్రంలోని పరిస్థితిపై సమీక్షించారు. ఈ వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఓ ప్రకటనలో వెల్లడించింది. 


ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో మోదీ ఫోన్ ద్వారా మాట్లాడారని సీఎంఓ ప్రకటన పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి అడిగారని తెలిపింది. రెండో ప్రభంజనంపై యుద్ధం జరుగుతున్న తీరును ప్రశంసించారని తెలిపింది. మూడో ప్రభంజనాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికను మోదీకి ఉద్ధవ్ వివరించినట్లు తెలిపింది. 


ఉద్ధవ్ థాకరే అంతకుముందు ప్రధాని మోదీకి రాసిన లేఖలో మహారాష్ట్రకు ప్రత్యేకంగా కోవిన్ తరహా యాప్‌ను అభివృద్ధిపరచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. వ్యాక్సినేషన్ కోసం కోవిన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చాలా మందికి సమస్యాత్మకంగా మారిందని తెలిపారు. 


Updated Date - 2021-05-08T22:45:15+05:30 IST